నదిలోకి మురుగునీరు వదులుతున్న టిజి వెంకటేష్



Want create site? Find Free WordPress Themes and plugins.
      టీడీపీ ఎంపీ టిజి వెంకటేష్ ఇంటి పై పడ్డారు వాటర్ మాన్ రాజేంద్రసింగ్. కర్నూలులో ఆయన ఇంటి పరిసరాలను పరిశీలించిన ఆయన ఆ నేత తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ ఇంట్లో వాడేసిన వృధానీటిని ఏకంగా తుంగభద్ర నదిలోకి పంపుతున్నట్లు తన పరిశీలనలో కనుక్కున్నారు. ఆయన ఇంటి పక్కన నుంచి వస్తున్న మురుగు కాలువ నీరు తుంగభద్రలో కలుస్తుంది. ఇది కర్నూలు జిల్లా నందికొట్కూరు వద్ద కృష్ణానదిలోకి విలీనం అవుతోంది. కృష్ణా నదీ తీరం కాలుష్యమయం అవడంపై వాటర్ మాన్ రాజేంద్రసింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదిని డంపింగ్ యార్డుగా మార్చారని రాజేంద్రసింగ్ చెప్పారు. కృష్ణా నది పరిరక్షణ యాత్రను చేపట్టిన ఆయన వివిధ ప్రాంతాలను సందర్శించి వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. 
       కర్నూలులో నదీ తీరం అంతా కాలుష్యమయం అయినా పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు రామన్ మెగస్సే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్. కృష్ణా నదీ తీరాన అక్రమ భవనాల నిర్మాణానికి అనుమతి ఇవ్వడం దారుణ విషయమన్నారు రాజేంద్రసింగ్. అమరావతి నగరం కృష్ణానది ఒడ్డున నిర్మించడం మంచిదన్నారు. కానీ నది ఒడ్డున అక్రమ భవనాలకు అనుమతులివ్వడం విచారకరమన్నారు రాజేంద్రసింగ్. ఇదే పరిస్థితి ఇక ముందు కొనసాగితే భవిష్యత్తుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు.
        నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీకి ఇప్పుడు రాజేంద్ర సింగ్ రూపేణా మరో ఆయుధం దొరికింది. టీడీపీ ఎంపీ టిజి వెంకటేష్ తన ఇంటి నుంచి మురుగునీరు ఏకంగా నదిలోకి పెడుతున్నారని..ముందు అలాంటివి ఆపాలని కోరుతున్నారు వైసీపీ నేతలు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*