‘పైసా వసూల్‌’ ఆడియో!



Want create site? Find Free WordPress Themes and plugins.
బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ నిర్మించిన సినిమా ‘పైసా వసూల్‌’. సెప్టెంబర్‌ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ముందు చెప్పిన తేదీ కంటే నెల రోజుల ముందే విడుదల కానున్న సినిమాగా ‘పైసా వసూల్‌’ చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఈ నెల 17న ఖమ్మంలో అభిమానుల సమక్షంలో జరగనున్న భారీ వేడుకలో ‘పైసా వసూల్‌’ పాటలను విడుదల చేయనున్నారు. ఈ వేడుకకు హీరో బాలయ్య, పూరి, నిర్మాతలు వెళ్లనున్నారు. అదే రోజున సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా స్టంపర్‌ రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.

      శ్రియ, ముస్కాన్, కైరా దత్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌–హాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడి ప్రత్యేక పాత్ర పోషించారు. ఇంకా అలీ, పృథ్వీ, పవిత్రా లోకేశ్, విక్రమ్‌ జిత్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం అనూప్‌ రూబెన్స్ అందించారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*