నంద్యాలలో కిలో బంగారు స్వాధీనం



Want create site? Find Free WordPress Themes and plugins.
       నంద్యాల ఉప ఎన్నికల్లో ఏం జరిగినా ఇప్పుడు పెద్ద వార్తవుతోంది. పోటీ చేస్తున్న అభ్యర్థులు కోట్ల రూపాయలను ఇప్పటికే ఖర్చు పెడుతున్నారు. కొందరు వాషింగ్ మెషిన్లు పంపిణీ చేస్తుండగా..మరికొందరు ప్యాన్లు పంచుతున్నారు. అధికార, విపక్ష పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాలుగా గాలాలు వేస్తున్నాయి. మరికొన్ని పార్టీలు రూ.1500 రోజుకు ఇచ్చి వేల మందితో ప్రచారం చేయిస్తోంది. ప్రతి రోజు నంద్యాలలో 5 వేల మంది విద్యార్థులను రంగంలోకి దింపింది ఓ పార్టీ. ఓటుకు రూ.5 వేల వరకు పంచుతోంది.
       మరోవైపు నంద్యాలలో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక కిలో 300 గ్రాముల బంగారం దొరికింది. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల నుంచి నంద్యాలకు వస్తున్న ఆర్‌టిసి బస్సును ఎస్‌ఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో నూనెపల్లె వద్ద తనిఖీలు చేశారు. అనుమానంగా ఉన్నఓ వ్యక్తి బ్యాగ్ లో నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణను మొదలు పెట్టారు. విజయవాడకు చెందిన ఓ వ్యాపారి రూ.20 కోట్లను నంద్యాలకు పంపగా..పోలీసులు సోదాలు నిర్వహించారు. సమాచారం కచ్చితమే అయినా..వాటిని ప్రధాన పార్టీల నేతలు చాలా జాగ్రత్తగా వాటిని తీసుకోవడం ఇప్పుడు ఉత్కంఠను పెంచుతోంది. వాహనాల టైర్లు, ట్యూబ్ లు, అంబులెన్స్, మీడియా వాహనాలు, కూరగాయల్లోను డబ్బులను నంద్యాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*