కమలం పార్టీకి దగ్గరవుతున్న ఎన్సీపీ



Want create site? Find Free WordPress Themes and plugins.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కమలం పార్టీకి దగ్గరయ్యే  సూచనలు కనపడుతున్నాయి. బీజేపేతర పార్టీల సమావేశానికి ఎన్సీపీ నేతలెవరు హాజరు కాకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు గుజరాత్ లో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ కు వ్యతిరేకంగా ఓటేశారు. ఇద్దరు వ్యతిరేకంగా ఓటేస్తే అహ్మద్ పటేల్ ఆశలు గల్లంతయ్యేవి. ఒకరు అనుకూలంగా, మరొకరు వ్యతిరేకంగా ఓటేశారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ ను వీడిన ఇద్దరు ఎమ్మెల్యేల తప్పు వల్ల అహ్మద్ పటేల్ బతికిపోయాడు. లేకపోతే ఓటమిని చవి చూడాల్సి వచ్చేది. 
                బీజేపీపై సమైక్య పోరాటాలకు సిద్దమయ్యేందుకు విపక్షాలతో కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ కీలక భేటీకి ఎన్‌సీపీ హాజరుకాలేదు. ఫలితంగా ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ బీజేపీకి దగ్గరవుతారా అనే చర్చ సాగుతోంది. భావ సారూప్యత ఉన్న 16 విపక్ష పార్టీలను ఏకం చేసేందుకు కాంగ్రెస్‌ అధిన్రేతి సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. గెలవకపోయినా..విపక్ష పక్షాన రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే వరకూ బీజేపీ ప్రభుత్వంపై సమిష్టిగా పోరాటాలు చేపట్టాలని బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కోరారు. బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా క్షే‍త్రస్థాయిలో జరుగుతున్న ఆందోళనల్లో విపక్షాలన్నీ పాల్గొనాలని మరోవైపు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించారు. ఇందుకు మిగతా పక్షాలు సమ్మతించాయి. మొత్తంగా వారందిరినీ ఏకతాటి పైకి తెచ్చినా..ఎన్సీపీ రాకపోవడం ఇప్పుడు హాట్ టాపికైంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*