బిగ్ బాస్ షోలోకి నవదీప్



Want create site? Find Free WordPress Themes and plugins.
     జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న బిగ్ బాస్ పై ఆసక్తి పెరుగుతోంది. ఎన్టీఆర్ వచ్చిన శని, ఆదివారాలు టీవీ రేటింగ్స్ అమాంతం పెరుగుతున్నాయి. ఆ తర్వాత మాములు స్థాయికి పడిపోతోంది. అదే సమయంలో పార్టిసిపెంట్స్ కోపతాపాలు, అలకలు, ఆవేశాలతో చూసే వారికి సరదాగానే ఉంటోంది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి మరో తెలుగు యువ నటుడు నవదీప్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. నటుడిగానే కాదు..బుల్లితెర అనుభవం ఉంది. సినిమా అవార్డ్స్ ఫంక్షన్స్‌కి హోస్ట్ గా వ్యవహరించిన నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నట్టు సమాచారం. టాలీవుడ్ నటి దీక్షా పంత్ ఇలానే అడుగుపెట్టింది. తొలి వారంలో చూపించిన దూకుడు ఇప్పుడు ఆమెలో లేదు. ఇప్పుడు కెప్టెన్ గా శివబాలాజీ ఎంపిక కావడంతో ఆయన ఎలిమినేట్ ఉండదు. మరోవైపు ఈ సారి ఇద్దరిని షో నుంచి ఎలిమినేట్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. వారిలో ముమైత్ ఖాన్, కత్తి మహేష్, హరితేజలలో ఒకరు కచ్చితంగా ఉంటారనే వాదనుంది. ఇక ప్రేక్షకులు ఎవరికి ఎక్కువగా వ్యతిరేకంగా ఓటేస్తే వారే ఎలిమినేట్ అయ్యే వీలుంది. 
       నవదీప్ ఎంట్రీ ఇస్తే ఇక బిగ్ బాస్ హౌజ్‌లో సందడే సందడి ఉంటుదనేది వాస్తవం. అంతే కాదు…వివాదాస్పద సెలబ్రిటీల జాబితా పెరగనుంది.  బిగ్ బాస్ హౌజ్‌లో పాల్గొంటున్న ముమైత్ ఖాన్ డ్రగ్స్ రాకెట్ కేసులో విచారణకు హాజరైంది. నవదీప్ ది అదే కథ. నవదీప్ రాక తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ పెరుగుతుందా లేదా అనేది ఆసక్తికరమే. వారిలో వారే చర్చించుకుని రెండు పేర్లను ఎనిమినేట్ కోసం ప్రపోజల్ చేయాలని చెప్పే విధానం వారిలో గొడవలు రేపుతోంది. ఇంకోవైపు బిగ్ బాస్ హవుజ్ లో వాషింగ్ మిషన్లు ఉండటం హాట్ టాపికైంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



1 Comment

Leave a Reply

Your email address will not be published.


*