కొరకరాని కొయ్యలుగా మారిన ముద్రగడ, కోదండరామ్ లు



Want create site? Find Free WordPress Themes and plugins.
        ఏపీలో ముద్రగడ, తెలంగాణలో కోదండరామ్ లు ఆయా ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యలుగా మారారు. కాపు రిజర్వేషన్ కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గతంలో ఆందోళనలు చేశాడు. దీక్షలకు దిగాడు. ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించింది. అయితే ముద్రగడ ఉద్యమం హింసాత్మకం, విధ్వంసం బాట పట్టడంతో ప్రభుత్వం ఆయన పై పూర్తిగా నిఘా పెట్టింది. అసలు ముద్రగడను ఇంటి నుంచి బయటకు పంపేందుకు సిద్దపడటం లేదు. ఫలితంగా ముద్రగడ నిరవధిక గృహ నిర్భందంలోనే కొనసాగుతున్నాడు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేంత వరకు తన ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పారాయన. అయితే ఉద్యమంలో రాజకీయాలకు తావు లేకుండా సాధించుకుంటే బాగానే ఉండేది. కానీ నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా కాపు నేతలంతా ఓటేయాలని పిలుపునివ్వడం విమర్శలకు తావిచ్చింది. పార్టీలతో సంబంధం లేకుండా ఉద్యమం చేస్తే సక్సెస్ అవుతోంది. కానీ ఏ పార్టీలో లేకుండా ఒక పార్టీకి వ్యతిరేకంగా మరో పార్టీకి అనుకూలంగా వెళ్లడం వల్ల ఉద్యమ తీరు పక్కదారి పట్టే వీలుంది. ఇప్పుడు ముద్రగడ విషయంలో అదే జరుగుతోంది. 
     మరోవైపు తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తీరు వేరు. ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు కోదండరామ్. తెలంగాణ వచ్చిందంటే కారణం పొలిటికల్ జేఏసీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడమే. కొన్ని సార్లు ఉద్యమాన్ని మధ్యలోనే కేసీఆర్ ఆపేసినా..కోదండరామ్ కొనసాగించిన ఉదంతాలు ఉన్నాయి. ఉద్యమ నేతగా కోదండరామ్ ను తప్పు పట్టలేం. కానీ తెలంగాణ సర్కారుకు కోదండర్ రామ్ వంటి నేతలు పంటికింద రాయిలా మారారు. కొరకలేం. అలాయని ఉయ్యలేం అన్న చందానా మారింది. కోదండరామ్ పై టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా మాటల దాడికి దిగారు. అయినా వెనక్కు తగ్గలేదాయన. మొన్నటి వరకు సాగునీటి ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలిచిన కోదండరామ్ నేడు దళితుల సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై దృష్టిపెట్టాడు. ఇది టీఆర్ఎస్ సర్కారును చికాకు గురి చేస్తోంది. కాంగ్రెస్ కు దన్నుగా నిలిచేలా కోదండరామ్ వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు చేస్తోంది గులాబీ పార్టీ. వాస్తవంగా కోదండరామ్ తన ఉద్యమాన్ని నిర్మాణాత్మకంగానే కొనసాగిస్తున్నాడు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*