నేను పార్టీ మారడం లేదంటే నమ్మరే…



Want create site? Find Free WordPress Themes and plugins.
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడుగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. 2004, 2009లలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్, డిఎస్ లదే హవా. కాలం మారింది. తెలంగాణ ఏర్పాడ్డాక ఆయన కాంగ్రెస్ ను వీడారు. గులాబీ తీర్థం పుచ్చుకున్న డిఎస్ కు అక్కడా సముచిత స్థానమే ఇచ్చారు సిఎం కేసీఆర్. రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. అంతే కాదు.. కీలకమైన విషయాల్లో ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు కేసీఆర్. ఈ మధ్య కాలంలో డిఎస్ అంత దూకుడుగా వెళ్లడం లేదు. పార్టీ కార్యక్రమాల్లోను అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
         దీంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం వచ్చింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి వార్తలను లీక్ చేస్తున్నారనే చర్చ లేకపోలేదు. విషయం ఏదైనా డిఎస్ ఈ వాదనను కొట్టిపారేశారు. తాను టీఆర్ఎస్ లో చాలా సంతోషంగానే ఉన్నానని చెప్పుకోవాల్సి వచ్చింది. మరో నెల రోజులు గడిచాయో లేదో మరోసారి సోషల్ మీడియాలో డిఎస్ గురించి అదే పుకార్లు షికారు చేశాయి. ఇంకేముంది డిఎస్ ఈ సారి పార్టీ మారడటం ఖాయమంటున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు దిగ్విజయ్ సింగ్ కు వ్యతిరేకంగా ఆయన సోనియాగాంధీకి లేఖ రాశారని తెలుస్తోంది. అందుకే దిగ్విజయ్ సింగ్ డిఎస్ కు వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చారంటున్నారు. మొత్తం విషయాలు తెలుసుకున్న సోనియాగాంధీ ఆయన్ను తప్పించి ఇప్పుడు కుంతియాకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆజాద్, డిగ్గీరాజాలు ఇద్దరి బాధ తప్పడంతో డిఎస్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే వాదన వచ్చింది. అదే సమయంలో ఈ మధ్య కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని డిఎస్ కలిశారంటున్నారు. దీంతో డిఎస్ పార్టీ మార్పుపై రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు డిఎస్ మరోసారి మీడియా ముందుకు వచ్చి మరీ తాను పార్టీ మారడం లేదు బాబాయ్ అని చెప్పుకోవాల్సి వస్తోంది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*