జగన్ మారడా…



Want create site? Find Free WordPress Themes and plugins.
       మిర్చి సినిమాలో హీరో ప్రభాస్ డైలాగ్ ఒకటుంది. నువ్వు మారవా..నువ్వు మారవురా…ఆ ఊరి మీద నీ కన్ను పడితే కన్నెర్ర చేసి నీ కంటి మీద కనుకు లేకుండా చేసిన ఆ మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి మీద నీ చెయ్యి పడితే నీ ఇంటి గుమ్మం దాకా వచ్చి నీ మెడ పట్టుకునే ఆ మగాడి పౌరుషం చచ్చిపోయింది. చచ్చిపోయి ప్రేమగా మారాడు. మీ ముందుకు వచ్చాడు. మీరు మారండని చెబుతాడు. టీడీపీ నేతలు గతంలో ఎలా ఉన్నా..అధికారంలోకి వచ్చాక సంయమనం పాటిస్తున్నారు. పౌరుషం లేక కాదు..మాటలు అనలేక కాదు. ప్రజల ముందు మంచి మనషులుగా ఉండేందుకే గతాన్ని వదిలిపెట్టామని చెబుతున్నారు. కానీ విపక్ష పార్టీ అధినేత జగన్ లో ఇంకా మార్పు రాలేదంటున్నారు ఆయన్ను చూసిన జనాలు. ఫలితంగా నంద్యాల ఉప ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. మాములు మాటలైతే పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. అదే వ్యక్తిగత విమర్శలకు దిగితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తోంది. అందుకేనేమో విపక్ష నేత జగన్ ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై విమర్శల పర్వం కొనసాగిస్తున్నాడు.
       చంద్రబాబు కర్నూలు ప్రజలను మోసం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. యువతకు నిరుద్యోగ భృతి, పేదలకు ఇళ్లు అంటూ చెప్పి మోసం చేశారన్నారు. అంతే కాదు…చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంటివెలగలలో జరిగిన రోడ్‌ షోలో వైఎస్‌ జగన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మూడున్నరేళ్లలో ముఖ్యమంత్రి, టీడీపీకి చెందిన ప్రధాన నాయకులెవరూ నంద్యాల వైపు తిరిగి చూడలేదని గుర్తు చేశారు. రాకీయ నాయకులు ఎవరైనా మాటిచ్చి తప్పితే ప్రజలు వారిని కాలర్‌ పట్టుకుని అడగాలన్నారు. 
         మొన్న చంద్రబాబును నడిరోడ్డు పై కాల్చిపారేయాలని వివాద స్పద వ్యాఖ్యలు చేశాడు జగన్. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ వివరణ అడగడంతో సమాధానం పంపిన తెల్లారి మరోసారి జగన్ రెచ్చిపోయాడు.ఎంతగా అంటే…చంద్రబాబును ఉరితీయాలని కోరారు. దీనికి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మరోసారి ఈసీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. అయినా వెనక్కు తగ్గలేదు. ఈసారి చంద్రబాబును కాలర్ పట్టుకుని అడగాలని కోరడం ఇప్పుడు హాట్ టాపికైంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*