తేల్చేసిన కమ్యూనిస్టులు



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద్యాల ఉప ఎన్నికల్లో కామ్రేడ్స్ ఎవరికి మద్దతు ఇస్తారనే అంశంపై నెలకున్న ఉత్కంఠకు తెరపడింది. అధికార టీడీపీ, బీజేపీ కూటమిని ఓడించాలని వారు పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఆరెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయన్నారు. అందుకే ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిని ఓడించాలన్నారు. అదే సమయంలో తాము ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది తేల్చి చెప్పలేదు. నంద్యాలలో ప్రధాన పోటీ టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ల మధ్యనే ఉంది. దీంతో టీడీపీని కాదంటే పరోక్షంగా వైసీపీకే వారి మద్దతు అని తెలుస్తోంది. కానీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన జగన్ పార్టీకి వారు బాహాటంగా మద్దతు పలకలేదు. ఈ మేరకు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం ఏపీ కార్యదర్శి మధులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 
              ఏపీ సర్కారు పాలనలో అవినీతి నెలకుందని.. ఇసుక అక్రమాలతో పాటు.. లంచగొండితనం పెరిగిందని… పార్టీ ఫిరాయింపులు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు వాళ్లు. ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు నేతలెవరు పాల్గొనలేదు. అసలు ఆ రెండు పార్టీలకు ఏపీలో ఒక్క ఎమ్మెల్యే లేకపోవడం ఆశ్చర్యమే. నంద్యాలలో పోటీ చేసినా గెలిచే సత్తా లేదనే ఆలోచనతో వారు వెనక్కు తగ్గారు. అంతే కాదు.. కోట్ల రూపాయలు పెట్టి పోటీ చేసే సామర్థ్యం తమ పార్టీలకు లేదని వారు చెప్పేస్తున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*