నంద్యాలలో టీడీపీకి ఓటేయాలన్న బీజేపీ



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద్యాల ఉప ఎన్నికల్లో అధికారిక తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే మద్దతు పలికింది ఏపీ బీజేపీ. ఈ మేరకు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. నంద్యాల ఉప ఎన్నికతో పాటు త్వరలో జరగనున్న కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీడీపీతో కలిసే పనిచేయాలని వారు తీర్మానించారు. టీడీపీ- బీజేపీలు రాష్ట్రంలోనేకాక కేంద్ర ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ మద్దతు విషయంలో మాత్రం బీజేపీ తన నిర్ణయాన్ని ఆలస్యంగా ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కమ్యూనిస్టులు టీడీపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునివ్వడంతో బీజేపీ టీడీపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకుంది. నంద్యాలలో బీజేపీ శ్రేణులు టీడీపీతో కలిసి ప్రచారంలో పాల్గొంటారని కమలం నేతలు తెలిపారు. మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్న నంద్యాలలో బీజేపీ ప్రచారం చేస్తే లాభం కంటే నష్టం ఉంటుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అందుకే ఆ పార్టీ పై ఎలాంటి ఒత్తిడి చేయలేదు టీడీపీ. ఇప్పుడు వారంతట వారే టీడీపీకి మద్దతు తెలపడంతో పాటు.. ప్రచారం పాల్గొనాలని నిర్ణయించడం మంచిదే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*