వృద్ధులను గౌరవిస్తున్న ఏపీ సర్కారు



Want create site? Find Free WordPress Themes and plugins.
 
 
      ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపిఎస్ ఆర్టీసీ మంచి నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్లను గౌరవించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి చార్జీల్లో 25 శాతం మేర రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎసి బస్సులతో పాటు…అన్ని బస్సుల్లోను ఈ రాయితీ వర్తిస్తుంది. ఆ రాయితీ మొత్తాన్ని సంవత్సరానికి గరిష్ఠంగా రూ. 12 కోట్ల ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వయో వృద్ధులకు ఆర్టీసీలో ప్రకటించిన రాయితీ ఇక అమల్లోకి రావడం శుభ పరిణామం. ఆర్టీసీలో ప్రయాణించే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకు ఈ రాయితీ వర్తిస్తోంది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీకి అందజేసింది. 60 ఏళ్ళు పైబడిన వయో వృద్ధులకు ఆర్టీసీలో 25 శాతం రాయితీ కల్పిస్తామని  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టీసీలోని తెలుగు వెలుగుతో పాటు ఏసీ గరుడ, స్లీపర్‌ కోచ్ లకు ఈ పథకాన్ని వర్తించనున్నట్లు ఆదేశాలిచ్చారు. దాంతో దూర ప్రాంత సర్వీసుల్లో వృద్ధులకు 25 శాతం రాయితీతో ధర తగ్గనుంది. రాయితీ సద్వినియోగం చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు వృద్ధులకు పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు. 
నిబంధనలు…
 
1. వారి వయసు 60 ఏళ్ళు పూర్తిగా నిండాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
2. టిక్కెట్‌ తీసుకునే సమయంలో ఆధార్‌ లేక పాన్ కార్డు లేదా ఇతర వయసు ధృవీకరణ పత్రం తప్పనిసరిగా చూపాలి. 
3. టిక్కెట్‌ రిజర్వేషన సమయంలో వయసు ధృవీకరణ పత్రం చూపి టిక్కెట్‌ తీసుకొన్నప్పటికీ ప్రయాణం చేసే సమయంలో అది ఉండాలి.
4. వయసు ధృవీకరణ పత్రం లేకపోతే మధ్యలో తనిఖీఅధికారులకు పట్టుపడితే జరిమానాలు విధిస్తారు. 
5. స్లీపర్‌ బస్సులలో రాయితీపోను ఛార్జీ ధర రూ. 98గా వస్తే రూ. 100లు ఛార్జీ తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు. 
6. చిల్లర సమస్య లేకుండా రూ. 10లు కలపనున్నట్లు నిబంధనల్లో పేర్కొన్నారు.
చంద్రబాబు సర్కారు తీసుకున్న ఈ రాయితీ పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒకవైపు ఆర్టీసీకి నష్టాలు వస్తున్నా…మరోవైపు వృద్దులను ఆదుకునేందుకు నడుం బిగించడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*