అద్భుత నగరంగా అమరావతి



Want create site? Find Free WordPress Themes and plugins.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి. ప్రపంచ స్థాయిలో ఇప్పుడు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకోసం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. యువత ఉపాధి కోసం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు ముఖ్యమంత్రి. ఇక మీదట అన్నీ అమరావతిలో అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు చెప్పారాయన. ప్రపంచస్థాయి సంస్థలు అమరావతికి వచ్చేందుకు క్యూ కడుతున్నాయి. కొన్ని కంపెనీలతో ఇప్పటికే ఒప్పందాలు జరిగాయి. తుళ్లూరు మండలం దొండపాడులో బీఆర్‌ఎస్‌ మెడిసిటీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 
               అమరావతిలో రైతులే ప్రథమ పౌరులు. రాజధాని కోసం వారు భూములిచ్చి అభివృద్ధికి మొదట అడుగు వేశారు. రాజధాని ప్రాంతాన్ని మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవకాశమిచ్చారు. బెంగళూరుకు చెందిన బీఆర్‌ శెట్టి సంస్థ రాజధానిలో రూ.12 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తద్వారా వేల మందికి ఉపాధి లభించనుంది. బీఆర్‌ శెట్టితోపాటు గల్ఫ్‌ దేశాల కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అమరావతి నుంచి ఎమిరేట్స్‌కు విమానం తిరగనుంది. అలానే ఇండో- యూకే ఆస్పత్రికి శంకుస్థాపన చేసేందుకు సిద్దమవుతున్నారు సి.ఎం చంద్రబాబు. 
                అంతే కాదు.. అమరావతికి 13 వైద్య కళాశాలలు రానున్నాయి. అరావతిలో 27 టౌన్‌షిఫ్ లను అభివృద్ధి చేయనున్నారు. అమరావతిలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు 15 నిమిషాల్లోనే చేరేలా ప్రణాళికలు సిద్దం చేశారు. తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరంలో గేమింగ్‌, వర్చువల్‌ స్టూడియోలను ఏర్పాటు చేయనున్నారు. అమరావతిని నాలెడ్జ్‌, మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దనున్నారు. అంతే కాదు… ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల నివాసం కోసం 4 వేల గృహాల నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లను మంజూరు చేశారు. 
                 మెడిసిటీలో రూ.3 వేల కోట్లతో వైద్య వర్సిటీ, వెయ్యి పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రూ.600 కోట్లతో వైద్య ఉపకరణాల తయారీ యూనిట్‌, రూ.250 కోట్లతో క్వాంటం డేటా సెంటర్‌, రూ.400 కోట్లతో అమరావతి ఐబీ స్కూల్‌, రూ.250 కోట్లతో నాలెడ్జ్‌ ప్రాసెసింగ్‌ ఔట్‌ సోర్సింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుండటం ఆసక్తిని పెంచుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*