నేనే రాజు నేనే మంత్రి మూవీ సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 2.75/5
నటీ నటులు : దగ్గుబాటి రానా, కాజల్,  అశుతోష్‌ రాణా, కేథరిన్ ధెరిస్సా, నవదీప్‌, పోసాని, జేపీ, రఘు కారుమంచి తదితరులు 
దర్శకుడు : తేజ
నిర్మాతలు : సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు : అభిరామ్‌ దగ్గుబాటి, వివేక్‌ కూచిభొట్ల 
బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్ టైయిన్ మెంట్స్
సమర్పణ : డి.రామానాయుడు
విడుదల : తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో 
పరిచయ వాఖ్యాలు…
లై, జయ జానకి నాయక, నేనే రాజు నేనే మంత్రి వంటి మూడు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. వేటికి అవే తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగులో రాజకీయ నేపధ్యంలో వచ్చిన కథ నేనే రాజు నేనే మంత్రి. బాహుబలి, ఘాజీ తర్వాత రానా నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. రానా చాలా పవర్ పుల్ పాత్రలో కనిపించి అలరించాడు. తేజ గత సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నా.. ఆయన మీద నమ్మకంతో ఈ సినిమాకు బాగానే వచ్చారు ఆడియెన్స్. 
కథలోకి వెళితే….
కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటాడు జోగేంద్ర( రానా) అనే వడ్డీ వ్యాపారి. భార్య రాధా (కాజల్ )ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఓ సారి అనుకోకుండా ఆ ఊరి సర్పంచ్ తో వివాదం వచ్చింది. తనకు జరిగిన అవమానంతో అనుకోకుండా రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు జోగేంద్ర. అక్కడ నుంచి అసలు సిసలు రాజకీయం మొదలవుతోంది. తొలిగా సర్పంచ్ గా గెలిచి.. ఆ తర్వాత ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఎదుగుతాడు. ముఖ్యమంత్రిగా చుక్కలు చూపిస్తాడు. ఇదే క్రమంలో శత్రువులు పెరుగుతారు. ఆ పాత్రలో అనేక ఆటుపోట్లు ఎదుర్కుంటాడు. అనేక దుర్మార్గాలు, దాడులు, ప్రతి దాడులు, హత్యలు జరుగుతాయి. రాధ జోగేంద్ర తాను అనుకున్న లక్ష్యం సాధించాడా లేదా అనేది సినిమా కథ. 
                         తాజా రాజకీయాంశాలను తేజ బాగానే చూపించాడు. మంత్రి అయ్యే క్రమంలో జోగేంద్ర ఏం చేస్తాడనేది ఆసక్తికరం. నేనే రాజు నేనే మంత్రి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం అనుకున్నంతగా లేదు. లక్ష్మీ భూపాల డైలాగ్స్ అదరగొట్టాయి. సెకండ్ హాఫ్ లో సినిమాను అనవసరంగా సాగదీశారానిపిస్తోంది. స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్. రాధా జోగేంద్రను ఎందుకు ఉరితీయాల్సి వచ్చిందనేది తెలుగు జనాలకు రుచించక పోవచ్చు. యాక్షన్ సీన్స్ లో రానా ఇరగదీశాడు. మరోసారి ఫస్టాప్ లో గత తేజను చూస్తాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. రాజకీయ నేతలకు ఈ సినిమా నచ్చుతుంది. లీడర్ వంటి సినిమాలో రాజకీయ నేతలను బాగా ఆకట్టుకున్న రానా ఇప్పుడు మరోసారి తన నటనతో అదే పని చేశాడు. తేజ స్టైల్ కామెడీ ఈ సినిమాలో ఉంది.
రానా కోసం…
జోగేంద్రగా రానా నటన బాగుంది. అందుకే రానా కోసం ఒకసారి కచ్చితంగా సినిమా చూడవచ్చు. జోగేంద్ర పాత్రలను మలిచిన తీరు బాగుంది. దర్శకుడు తేజ అనుకున్నట్లుగా రానా నటించి మెప్పించాడు. బాహుబలి తర్వాత వచ్చిన తెలుగు సినిమా కావడంతో అదే స్థాయి నటనను కనపరిచాడు. మరోవైపు రానా భార్యగా కాజల్ బాగానే చేయగా… రిపోర్టర్ గా కేథరిన్ మెప్పించింది. ఇక పోసాని, నవదీప్, అశుతోష్ రాణాలు తమకిచ్చిన పాత్రలకు బాగానే న్యాయం చేశారని చెప్పాలి. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అద్భుతమనే చెప్పాలి. అనూప్ రూబెన్స్ బాణీలు బాగున్నాయి. అవసరమైన సందర్భంలో సంగీతం వినాలనిపిస్తోంది. ఫస్టాప్ ఎడిటింగ్ బాగానే ఉన్నా… సెకండ్ హాఫ్ ఏదో కట్ చేశారనిపించింది. మొత్తంగా సినిమా చాలా రిచ్ గానే కనిపిస్తోంది. ఖర్చుకు వెనుకాడలేదని అర్థమవుతోంది.  
                  నేనే రాజు సినిమా డైలాగ్స్ బయటకొచ్చాక కూడ పలికేలా ఉన్నాయి. తేజ కామెడీ అదిరింది. సినిమా మొదటి భాగం ఆసక్తిగా సాగడం, సెకండ్ హాఫ్ బోర్ కొట్టించడంతో చివరకు పర్వాలేదు అనుకునేలా ఉంది. అవసరమైన సందర్భాల్లో సెంటిమెంట్ సీన్స్ మెప్పిస్తాయి. తేజ ముగింపు చాలా ఆశ్చర్యంగా ఉంది. హీరోను ఉరితీసే సన్నివేశం వరకు సినిమాను తీసుకురాకపోతే బావుండేదనిపిస్తోంది. 
ప్లస్ పాయింట్స్
+ రానా నటన
+ ఫస్టాప్ వేగం
+ సినిమాటోగ్రఫీ
+ మంచి సంగీతం
+ తాజా రాజకీయాంశాలు
మైనస్ పాయింట్స్…
– బోర్ కొట్టిన సెకండాఫ్
– వేగం తగ్గడం, సాగతీత
– సినిమా ముగింపు 
మొత్తంగా… ఓ సారి చూడొచ్చు…
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*