ఫ్రెష్ అబ్బాయి కావాలంటున్న ముమైత్ ఖాన్



Want create site? Find Free WordPress Themes and plugins.
బిగ్ బాస్ షో రేటింగ్ లో దూసుకుపోతోంది. తెలుగులో తొలి రెండు వారాలు ఏదోలా సాగిన షో ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. రాత్రి 9 దాటితే చాలు.. ఎప్పుడు బిగ్ బాస్ షో వస్తుందా అని ఎదురు చూస్తున్నారు జనాలు. మరోవైపు వీకెండ్ లో జబర్దస్త్ షో ఎలాగు ఉండనే ఉంది. అదే సమయంలో ప్రో కబడ్డీ ఇలా వరుసగా వచ్చే ప్రొగ్రామ్స్ ను మిస్ కాకుండా చూస్తున్నారు. తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 26వ ఎపిసోడ్‌లోకి వచ్చేసింది. బిగ్ బాస్ షోలో ముమైత్ ఖాన్ గోల గోల చేస్తోంది. ముమైత్ ఖాన్ ఏది మాట్లాడినా డైరెక్టు ఎటాక్ లా ఉంటుంది. ఇప్పుడు ఆమె కోరని ఓ కోరిక కోరింది. అదేంటో తెలుసా. తనకు ప్రెష్ గా ఉండే అబ్బాయి కావాలట. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలంటూ చెప్పేసింది.
       అందులోను అతనికి పెళ్లి కాకూడదని చెప్పింది. పెళ్లైన సెకండ్ హ్యాండ్ వద్దని, గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండకూడదని, ఎలాంటి రిలేషన్ లేని ఫ్రెష్ అబ్బాయి కావాలని అందరి ముందు ముమైత్ చెప్పడం ఆసక్తికరమే. తన కలల రాకుమారుడి కోసం చాలా కండిషన్స్ పెట్టేసింది. అక్కడే ఉన్న శివబాలాజీ, ధనరాజ్ కల్పించుకుని పెళ్లైన వాడితో నీ ప్రాబ్లమ్ ఏంట అనగానే…. నాకు ఫ్రెష్ అబ్బాయే కావాలని అడిగింంది. అంతే కాదు… అలాంటి వాడిని బిగ్ బాస్ హౌస్‌కి పంపించాలని ఏకంగా బిగ్ బాస్‌ను రిక్వెస్ట్ చేసింది. అలాంటి వాడు కావాలంటే దొరకడని ప్రత్యేకంగా చేయించుకోవాలని పంచ్ వేశాడు ధనరాజ్. మరోవైపు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో మీరు చర్చించుకుని తేల్చుకుని చెప్పాలని బిగ్ బాస్ చెప్పడంతో అంతా ఆపనిలో పడ్డారు. 
         ధన్ రాజ్, శివబాలాజీలు తాము ఎలిమినేట్ అవుతామని.. కానీ జనాలు ఎవరిని ఉంచితే వారే ఫైనల్ అని ఆలోచించారు. దీనికి ప్రిన్సీ అడ్డు చెప్పారు. మరోవైపు కత్తి మహేష్ అలా వద్దని చెప్పడంతో పాటు.. అంతా కూర్చుని మాట్లాడుకుందామని ప్రతిపాదించాడు. ఈలోపు తాను బయటకు వెళతానని.. దీక్షా ముమైత్ చెప్పడంతో ఇప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకుంది. శనివారం ఎన్టీఆర్ వచ్చి.. ఎలాగు ఒకరిని పంపడం ఆనవాయితీ.  మరి ఈ వారం ఎవరు ఆ ప్లేస్ లో ఉంటారో చూడాలి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*