‘లై’ సినిమా సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 3/5
నటీనటులు : నితిన్, మేఘ ఆకాష్, అర్జున్, అజయ్ తదితరులు
దర్శకుడు : హను రాఘవపూడి
నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర
సంగీతం : మణి శర్మ
బ్యానర్ : 14 రీల్స్ ఎంటెర్ టైయిన్ మెంట్
పరిచయం…
            తేజ తీసుకువచ్చిన జయం సినిమాతో హీరోగా తెర మీదకు వచ్చాడు నితిన్. దిల్, సై, టక్కరి, గుండెజారి గల్లంతైయిందే, హార్ట్ ఎటాక్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ రెండు, మూడేళ్లుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు నితిన్. చిన్నదాన నీకోసం, కొరియర్ బాయ్ కల్యాణ్, అ..ఆ వంటివి ఆశించినంతగా ఆడలేదు. ఇప్పుడు భారీ అంచనాలతో వచ్చిన సినిమా లై లో నితిన్ న్యూ లుక్ తో అదరగొట్టాడు. బడ్జెట్ లోను 14 రీల్స్ ఎంటర్ టైయిన్ మెంట్ వెనక్కు తగ్గలేదు. చాలా రిచ్ గా సినిమా తీశారు. దర్శకుడు హను రాఘవ పూడి గతంలో ‘అందాల రాక్షసి’, ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ వంటి ప్రేమకథా చిత్రాలను అందించడంతో అంచనాలు బాగానే ఉంటాయి. ప్రేమ కాన్సెప్ట్ తో కాస్త డిఫరెంట్ గా తెరకెక్కింది ‘లై’. ఇది ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకుందాం…
కథలోకి వెళితే…
           పద్మనాభం (అర్జున్) తెలివైన వ్యాపారి. రహస్య మాఫియా డాన్. ఆయన కింద రవికిషన్ లోకల్ డాన్ గా చేస్తుంటాడు. మరోవైపు అబద్ధాలే జీవితంగా బతుకుతుంటాడు సత్యం ( నితిన్). అలాంటి సమయంలోనే చైత్ర (మేఘ ఆకాష్) పరిచయం ఏర్పడుతోంది. ఆమెకు ఓ అందమైన అబద్ధం చెబుతాడు నితిన్. అలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతోంది. మొదట్లో చైత్ర అతని ప్రేమను ఒప్పుకోక పోయినా.. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అబద్దాలతోనే కథానాయికని ముగ్గులోకి దించుతాడు నితిన్. వారి ప్రేమకథ సగానికి వచ్చేసరికి ఆసక్తికర మలుపు వస్తోంది. నితిన్ కి ఒక వస్తువు దొరుకుతుంది. అది తనకు తెచ్చి ఇవ్వాలని అర్జున్ నితిన్ ని కోరతాడు. ఆ వస్తువు చాల కీలకం కావడంతో చిక్కులు తప్పవు. అసలు ఆ బ్యాగ్ లో ఏముంది. నితిన్- అర్జున్ కు ఎందుకు గొడవలొస్తాయి. వారు అమెరికాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది… చివరికి నితిన్, మేఘ ఆకాష్ ల ప్రేమ ఏమైందనేదే లై సినిమా కథ. 
విశ్లేషణ….
      ‘లై’ కథ అంతా హీరో నితిన్‌.. విలన్ అర్జున్‌ల మధ్య సాగతోంది. పిల్లి ఎలుకల కథలా ఉంటోంది లై స్టోరీ. కాకపోతే ఎప్పుడు తెలుగు సినిమాల్లో చూసే కమర్షియల్ హంగులు కనపడవు. ఫస్ట్‌ హాఫ్ ని బోర్ కొట్టకుండా హను రాఘపూడి బాగానే నడిపించాడు. దర్శకకత్వ ప్రతిభ బాగానే కనపడింది. ఇంటర్వెల్ అప్పుడు ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి సినిమాపై ఆసక్తిని పెంచాడు దర్శకుడు. సెకండాఫ్‌లోను చాలా జాగ్రత్తగా స్క్రీన్ ప్లే రాసుకుని ట్విస్ట్‌లు ఇస్తు క్లైమాక్స్‌ వరకు కథను పెద్దగా బోర్ కొట్టకుండా నడిపించిన తీరు బాగుంది. అబద్దమే సినిమాను ముందుకు నడిపించింది. నితిన్ -అర్జున్ మధ్య వచ్చే సన్నివేశాలు అదుర్స్. హీరో నితిన్‌ కంటే అర్జున్ నటన ఇంకా బాగుంటుంది. లవ్, ఎమోషన్, యాక్షన్, సెంటిమెంట్ వంటి అంశాలు బాగానే ఉన్నాయి. 
నటన ఎలా ఉందంటే…
         లై సినిమాలో నితిన్ నటన బాగుంది. అయితే కొత్త లుక్ లో చూస్తే నితిన్ చాలా బావుంటాడు. అదే సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అబద్దాలను చాలా అవలీలగా చెప్పేయడం నితిన్ కే సాధ్యమైంది. నటనలోనే కాదు… డైలాగ్ డెలివరి లోను బాగానే రాణించాడు. ఇక సీనియర్ హీరో అర్జున్ నటనలో మరోసారి ఇరగదీశాడు. గతంలో శ్రీఆంజనేయంలో నితిన్ తో కలిసి నటించాడు అర్జున్. అయితే అర్జున్ పాత్ర విలనిజానికే కొత్త అర్థం వచ్చేలా ఉంది. జగపతిబాబు తరహాలో అర్జున్ ఇప్పుడు ఇలాంటి పాత్రలకు బాగా పనికొస్తాడనిపిస్తోంది. హీరోయిన్ మేఘ ఆకాష్ నటన పర్వాలేదు. కానీ గ్లామర్ ను బాగానే ఒలికించింది. ఆ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎప్పటి లానే అజయ్ నటన బాగుంది. మిగతా వారు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. 
మిగతా అంశాలు…
లై సినిమాలో దర్శకుడు హను రాఘవపూడి ప్రతిభ గురించి చెప్పుకోవాలి. అర్జున్ పాత్రను మలిచిన తీరు అద్భుతం. విలన్ పాత్రలను ఇలా కూడ మలచవచ్చా అనిపిస్తోంది. స్రీన్ ప్లే బాగుంది. కథే ఇక్కడ హీరో. అది ఎటు మళ్లితే అటు హీరో, విలన్ రూటు మారుస్తారు. అందుకే హనుమ అలా సినిమాను తీసిన తీరు బాగుంది. 14 రీల్స్ సంస్థ ఖర్చు విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గలేదు. చాలా సీన్స్ రిచ్ గా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ తీసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంచుకున్నారు. మణి శర్మ సంగీతం మరోసారి పాత పాటలను గుర్తుకు తెచ్చాయి. బొంబాట్ సాంగ్ చూసి తీరాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. 
ప్లస్ పాయింట్స్
+ దర్శకుడి ప్రతిభ
+ అద్భుతమైన కథ,  స్క్రీన్ ప్లే 
+ నితిన్, అర్జున్ ల నటన
+ ప్రేమ కథ
+ ఆసక్తికరమైన మలుపులు
+ మణి శర్మ సంగీతం
+ ఆకట్టుకున్న ముగింపు 
మైనస్ పాయింట్స్…
– సెకండాఫ్ కొద్దిగా బోర్
– తగ్గిన కామెడీ
– కమర్షియల్ హంగులు లేకపోవడం 
– డిఫెరెంట్‌ మూవీ 
మొత్తంగా… సినిమా చూడవచ్చు… బాగుంది..
Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

Leave a Reply

Your email address will not be published.


*