డ్రగ్స్ కేసు నీరుగారినట్లేనా…



Want create site? Find Free WordPress Themes and plugins.
డ్రగ్స్ కేసు ఇక ముగిసినట్లేనని.. శిక్షలు పడవనే వాదనుంది. ఇలాంటి సమయంలో మళ్లీ తెరపైకి వచ్చాడు. ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. కెల్విన్ ముఠా దొరికాక డ్రగ్స్ కేసులో సంచలాత్మకమైన విషయాలు బయటపడ్డాయి. సినీ రంగానికి చెందిన వారికి లింక్ ఉన్నట్లు గ్రహించింది సిట్. పలువురు సినీ ప్రముఖులను విచారించినా అరెస్టులు లేవు. సి.ఎం కేసీఆర్ ఈ కేసులో సినీ ప్రముఖులు బాధితులే కానీ.. నిందితులు కారన్నారు. ఇంకోవైపు అకున్ సబర్వాల్ తనపై ఒత్తిడులు పెరిగాయని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాట మార్చారు. ఇఫ్లూ యూనివర్సిటీలో జరిగిన ఓ సెమినార్ లో అకున్ పాల్గొని పలు విషయాలపై మాట్లాడారు. సినీ రంగానికి చెందిన వ్యక్తుల విచారణ పూర్తయింది. ఈకేసు దర్యాప్తులో న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నాని చెప్పారు. 
              అంతే కాదు…డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ తరువాత రెండో దఫా విచారణ జరుగుతుందని ప్రకటించాడు. ఇప్పటికే తీసుకున్న ఎస్ఎఫ్ ఎల్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఆ రిపోర్టు అందగానే ఛార్జీషీట్ దాఖలు చేస్తామన్నారు సిట్ అధికారి. డ్రగ్స్ కేసులో పెద్ద తలకాయలతో పాటు..ప్రజా ప్రతినిధుల పిల్లల పేర్లు రావడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ ఆ  కేసు ఇప్పుడు మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా మారడంతో నీరుగారిపోయినట్లేనని వాదనుంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*