జిఎస్టీ పై గులాబీల ఒంటరి పోరు



Want create site? Find Free WordPress Themes and plugins.
జిఎస్టీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందిపడుతోంది. తొలిగా వస్తు సేవల పన్ను అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు తెలంగాణ సి.ఎం కేసీఆర్. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అది నిజం కాదని చెప్పిన కేసీఆర్ వినలేదు. కానీ ఇప్పుడు అసలు విషయం తెలిసి దిద్దుబాటుకు దిగింది తెలంగాణ సర్కారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి నామినేషన్లు, ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హస్తిన వెళ్లిన కేసీర్ జిఎస్టీ పై మాట్లాడలేదు. జిఎస్టీ చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు ఆ ఎన్నికలు అన్నీ అయిపోయాయి. ఇక పోరాటం బాట పట్టింది. మిగతా రాష్ట్రాలు తమకు మద్దతునిస్తాయని భావించారు కేసీఆర్. కానీ అనుకున్నంతమేర వారు కేసీఆర్ కు మద్దతుగా నిలవడం లేదు. తెలంగాణ ప్రభుత్వానికి ఇది కొంత ఇబ్బందిగా మారింది.
              సాగునీటి ప్రాజెక్టులపై జిఎస్టీ తొలగించాలని, లేదా ఐదు శాతానికే పరిమితం చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఇదే విషయం పై టిఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. జిఎస్టీ పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతానికి తగ్గించారు. కానీ అంతకు మించి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఇతర రాష్ట్రాల మద్దతు ఉంటే సరే. లేకపోతే గులాబీ నేతలది ఒంటరి పోరే అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది. ఫలితంగా జిఎస్టీ వల్ల ఇబ్బంది పడుతోంది. గతంలో జిఎస్టీని సమర్థించిన కేసీఆర్ ఇప్పుడు కేంద్రం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసి.. కలిసి వివరించే ప్రయత్నం చేసేందుకు సిద్దమవుతుండటం ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*