రేమాండ్ అధిపతికి బతుకు కష్టాలు



Want create site? Find Free WordPress Themes and plugins.
రేమాండ్. బట్టల వ్యాపార ప్రపంచంలో ఆ కంపెనీ ప్రభంజనమే. అంతగా ఆ కంపెనీకి గుడ్ విల్ తీసుకువచ్చింది రేమాండ్ అధిపతి విజయ్ పథ్ సింఘానియానే. ఇప్పుడాయన ఎనిమిది పదులు వయసుకు వస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన హాయిగా తన పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా ఆడుకోవాలి. ఆనందంగా జీవించాలి. కానీ సీన్ రివర్స్ అయింది. విజయ్ సింఘానియా కుమారుడు గౌతమ్ సింఘానియాతో కోర్టులో తన ఆస్తి కోసం పోరాడాల్సి వచ్చింది. రూ. 1041 కోట్లను కొడుక్కు రాసిచ్చాడు తండ్రి. తనకున్న ఆస్తి అంతా పిల్లలకు ఇచ్చేశాడు. ఇప్పుడు వృద్దాప్యంలో ఉన్న తనను ఎవరూ పట్టించుకోవడం లేదని కోర్టులో కేసు వేశాడాయన. 
             వారి మధ్య ఎందుకు గొడవ వచ్చిందో తెలియదు కానీ… విజయపథ్ సింఘానియాను గౌతమ్ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే తన పిల్లోడి నుంచి తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని ఆయన కోర్టు గడప తొక్కాడు. ముంబై కోర్టు దీనిపై విచారణ చేస్తోంది. తనకున్న విలువైన షేర్లు, ఇతర ఆస్తులన్నింటిని కొడుకు గౌతంకు ఇచ్చినా.. ఎందుకు పట్టించుకోవడం లేదనే చర్చ సాగుతోంది. రేమాండ్ కంపెనీ పేరుతో 36 అంతస్థుల భవంతి ముంబైలో ఉంది. కానీ విజయ్ పథ్ అద్దె ఇంటిలో ఉంటున్నారని తెలుస్తోంది. తనకు వాడుకునేందుకు కనీస ఖర్చులకు కంపెనీ నుంచి ఇవ్వకపోవడం బాధాకరం. కొడుకుల కోసం సంపాదించి పెట్టిన రేమాండ్ అధిపతి.. చివరకు అదే డబ్బుల కోసం కోర్టులకు వెళ్లడం ఆశ్చర్యమే. ఎంత కొడుకులు, కూతుళ్ల మీద ప్రేమ ఉన్నా.. తాను చనిపోయేంత వరకు కొంత మొత్తం ఉంచుకోవాలనేది రేమాండ్ అధిపతి జీవితాన్ని చూస్తే అర్థమవుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*