నేరేళ్ల బాధితులకు కోర్టు అండWant create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణలో సంచలనం సృష్టించిన నేరేళ్ల ఘటన పై హైకోర్టు సీరియస్ గానే స్పందించింది. పోలీసుల చిత్ర హింసలకు గాయపడిన వారికి వైద్యం అందించేందుకు వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రి నుంచి ఇద్దరు వైద్యుల్ని పంపాలని కోర్టు ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు బాధితుల గాయాలను పరీక్షించి.. గాయాల తీవ్రతను తెలుసుకోవాలని సూచించింది. అవసరమైతే బాధితులను నిమ్స్ కు తరలించాలని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించడం ఇప్పుడు హాట్ టాపికైంది.
                  మరోవైపు నేరెళ్ల ఘటన పై సీబీఐతో కానీ ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనం వ్యాజ్యంపై విచారణ చేసింది. తంగళ్లపల్లి వాగు నుంచి రోజుకు 200 వరకు ఇసుక లారీలు నేరెళ్ల జిల్లెల రామచంద్రాపురం గ్రామాల మీదుగా వెళ్తుంటాయి. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నేరెళ్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. దీంతో స్థానికులు ఆందోళన చేశారు. జులై 4న రాత్రి 11 గంటలు తర్వాత సాధారణ దుస్తుల్లో వచ్చిన పోలీసులు నేరెళ్ల జిల్లెల రామచంద్రాపురం గ్రామాలకు చెందిన 8 మందిని తీసుకెళ్లారు. వారిపై థర్డ్ డిగ్రీ పద్ధతులను ప్రయోగించారు. రబ్బరు లాఠీలతో చితకబాదారు. కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలకు గురి చేశారు. మర్మాంగాలను తీవ్రంగా గాయపరచడంతో పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. కరీంనగర్ జిల్లా ఎస్పీ విశ్వజిత్ స్వయంగా బాధితులను కొట్టారనే ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని బయటికి చెబితే కుటుంబ సభ్యులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారని తెలుస్తోంది. పోలీసులు జులై 4న బాధితులను తీసుకెళ్లినా కోర్టులో హాజరుపరచలేదు. చివరికి ఆందోళనకు దిగడంతో జులై 8న కోర్టులో హాజరపరిచారు. కోర్టు వారిని రిమాండుకు ఆదేశించింది. 
                  గాయాలకు సంబంధించి వైద్యుల ధ్రువీకరణ ఇస్తేనే అనుమతిస్తామని జైలు సూపరింటెండెంట్ చెప్పడంతో పోలీసులు డాక్టర్ సర్టిఫికెట్ ఇప్పించారన్నారు. గాయాల తీవ్రత నేపథ్యంలో వైద్యులు కరీంనగర్ ప్రభుత్వాసుత్రికి పంపి చికిత్స అందించారు. తరువాత వేములవాడ విడిచి వెళ్లరాదంటూ షరతులతో కూడిన బెయిలు మంజూరైంది.  దీంతో బాధితుల్లో ఆరుగురు అక్కడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తమ వాదన వినిపించారు బాధితుల పక్షాన న్యాయవాది. 
                   నేరేళ్ల బాధితులను కొట్టడమే కాకుండా వారిని ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిచ్చింది. దీంతో మంత్రి కేటీఆర్ దిద్దుబాటు చర్యలకు దిగారు. బాదితులను పరామర్శించి వారికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. కానీ పోలీసుల పై ఎలాంటి చర్యలు తీసుకుంటామనేది వెల్లడించ లేకపోయారు. దళితులను చావబాదడమే కాకుండా వారి పై కేసులు పెట్టడం ఆశ్చర్యమే మరి. తెలంగాణలో రాక్షస ప్రభుత్వం ఉందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నయమనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో ఇప్పుడు కేసీఆర్ సర్కారు ఇరకాటంలో పడింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*