ఆదర్శమైన తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సేవలుWant create site? Find Free WordPress Themes and plugins.
 
         సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది తెలంగాణ అమెరికా తెలుగు సంఘం. లాభాపేక్ష లేకుండా సేవలందిస్తున్న ఈ జాతీయ సంస్థ ప్రతిసారీ లానే వేసవిలో నిరు పేదలకు పౌష్టికాహారం, దుస్తుల పంపిణీ, బొమ్మలను అందిస్తోంది. జులై నుంచి డిసెంబర్ వరకు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం( టాటా) ఇలానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే. అమెరికాలో ఈసారి టాటా అదే పని చేసింది. ట్రై స్టేట్ బేకన్ ఆఫ్ ఇంక్ ప్రాంతంలో ఆహారం, దుస్తులు, బొమ్మలను ఉచితంగా పంచింది. న్యూజెర్సీలోని వేలాది మంది నిరాశ్రయులకు ఈ సేవలు అందించింది. ఈ అతి పెద్ద కార్యక్రమానికి టాటా సహాయ కార్యదర్శి డాక్టర్ దామోదరరెడ్డి మల్లాది నేతృత్వం వహించగా…ఆర్వీపీ ధన్ రాజ్ సిరి, సతీష్ మేకల, గంగాధర్, ప్రసాద్ కూనరపు, భాస్కర్ పిన్నా, వేణు ఎనుగాలలు ముందుకు తీసుకెళ్లారు.  
        తెలంగాణ అమెరికా తెలుగు సంఘం చేస్తున్నసేవలను ప్రశంసించారు టాటా సలహా కమిటీ చైర్మన్ డాక్టర్ పైలా మల్లారెడ్డి. సమాజంలో అత్యున్నత సేవలు అందిస్తున్న టాటాను అభినందించారు. ఇలాంటి సేవలను మరింతగా విస్తరించాలని కోరారు. ప్రతి సంస్థ శీతాకాలంలో ఆహారం పంపిణీ కార్యక్రమాలను చేస్తుంటాయి. కానీ వేసవిలో ఆహారం అందించడం చాలా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం. టాటా అలా అందించడం వల్ల మిగతా స్వచ్చంధ సంస్థల మీద పడే భారం తగ్గుతుందన్నారు మల్లారెడ్డి. మరోవైపు ఆహార పదార్థాలను సేకరించి..పంపిణీ చేయడం చాలా బావుంటుందన్నారాయన. 
         సమ్మర్ ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తున్న, అందుకు సహకరిస్తున్న బిఓడిస్, ఆర్వీపీస్, ఎస్సీస్, ఆర్సీలకు కాలిపోర్నియా నుంచి ఫోన్ చేసి మరీ కృతజ్ఞతలు తెలిపారు టాటా అధ్యక్షులు ఝాన్సీరెడ్డి. ప్రతి ఏటా రెండు మూడు సార్లు ఇలా సమ్మర్ క్యాంప్ పెట్టేందుకు తన వంతుగా కృషి చేస్తున్న డాక్టర్ రమ మల్లాదిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. టాటా అధ్యక్షులుగా ఎంపికైన మహేందర్ ముసుగు ఈ కార్యక్రమానికి విచ్చేసి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం నిర్వహించేందుకు విరాళాలు ఇచ్చిన వారందరినీ మహేందర్ ప్రశంసించారు. ఒకవేళ ఆహారం పంపిణీకి కొరత ఏర్పడితే టాటా అక్కడకు వస్తుంది మీకు కావాల్సినవి అందిస్తుందని చెప్పారు మహేందర్. ఏడాదికి పది సార్లు ఆహారపు పంపిణీ చేసేందుకు సిద్దమని ప్రకటించారాయన. అలా పేదలకు సాయం చేయడం వారి ఆకలిని తీర్చేందుకు టాటా సహకరించడం నాకు ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. 
        ఈ ట్రైట్ పుడ్ డ్రైవ్ నిర్వహిస్తున్న వారికి టాటా మాజీ కోశాధికారి గౌతమ్ గోలి అభినందనలు తెలిపారు. టాటా నుంచి నాకు సమాచారం రావడమే ఆలస్యం..సేవలకు అవసరమైన అన్ని సహయ,సహకారాలు అందించేందుకు సిద్దమని ప్రకటించారు. ఆర్థికంగా ఇచ్చేందుకు దానం చేసేందుకు తాము సంసిద్దంగా ఉన్నట్లు చెప్పారు. పేదరికం, ఆకలితో ఉన్న వారికి ఆహరం విలువ ఏంటో తనకు బాగా తెలుసన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న వారందరికీ అంతా మంచి జరగాలని కోరుకున్నారు గోతమ్. 
       ఆకలితో అలమటించే వారికి తమ వంతుగా సాయం చేసేందుకు టాటా ఇలాంటి కార్యక్రమం ఎంచుకోవడం మహాద్భుతం, సదవకాశమని న్యూజెర్సీలోని బేకన్ హోప్ ఇంక్ డైరెక్టర్ డార్లెన్ అభిప్రాయపడ్డారు. ఆకలితో ఉన్న మాకు అవసరమైన బీన్స్, రైస్, బంగాళదుంపలు, బ్రోకలీ, టోమాటోలు, పాస్తా, బ్రెడ్ తో పాటు..ప్రోటీన్లు ఉన్న ఆహారం పుష్కలంగా అందిందని చెప్పారు. ఆహారమే కాదు…ద్విచక్ర వాహనాలు, బెడ్స్, గృహోపకరణాలు, దుస్తులు, ఆట బొమ్మలను వారు అందించారని చెప్పారు.మరో ఆరు నెలల వరకు తమకు అవసరమైన ఆహారం, దుస్తులు వంటి అవసరాలు ఈ సాయంతో తీరిందని చెప్పారు బేకన్ హోప్ ఇంక్ డైరెక్టర్ డార్లెన్.
 
       ఈ కార్యక్రమంలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘానికి చెందిన ధన్ రాజ్ సిరి, సతీష్ మేకల, గంగాధర్, స్వామి బోడిగి, శివారెడ్డి, ప్రసాద్ కునరపు, ఎన్ ఎన్ రెడ్డి దొంతిరెడ్డి, భాస్కర్ పిన్నా, కవిత తాటికొండ, రమణ కొత్తా, అలేఖ్య ఇంద్రగంటి, శశి కసిర, వేను ఈనుగల, వంశీ గుళ్లపల్లి, అమర్ వెలమల తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*