తమిళనాడులో ఏకం కానున్న రెండు వర్గాలు



Want create site? Find Free WordPress Themes and plugins.
తమిళనాడులో ఏఐఏడిఎంకేలోని పళని స్వామి, పన్నీరు సెల్వం వర్గాలు కలవనున్నాయి. ఈ మేరకు రెండు వర్గాల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. సి.ఎం పళనిస్వామి, మాజీ సి.ఎం పన్నీరు సెల్వంలు ఈ నెల 15న విలీనం అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు. పన్నీరు సెల్వంకు డిప్యూటీ సి.ఎం పదవితో పాటు.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చేందుకు సి.ఎం వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. మరోవైపు దినకరన్ ఏమంటారనే విషయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకుంది. చిన్నమ్మ శశికళ జైలుకు వెళ్లడంతో.. ఆ వర్గం ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. దివంగత సి.ఎం జయలలిత చనిపోయాక.. సి.ఎం కుర్చీ కోసం శశికళ విశ్వ ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు రాకపోతే కచ్చితంగా శశికళ సి.ఎం కుర్చీపై కూర్చునేవారు. కాలం కలసిరాలేదు. శశి జైలుకు వెళ్లారు. అక్కడా లంచాలతో రాజభోగం అనుభవిస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. మొత్తంగా ఇప్పుడు ఏఐఏడిఎంకే వర్గాలు కలిసిపోవడం వెనుక బీజేపీ వ్యూహం ఉన్నట్లు చర్చ సాగుతోంది. అవి రెండు కలిస్తే డిఎంకేకు గట్టి పోటీ ఇవ్వచ్చంటున్నారు. ఇంకోవైపు డిఎంకే గెలుపు బాధ్యతలను ప్రశాంత్ కిషోర్ తీసుకోవడంతో ఎలాంటి ఎత్తులు వేస్తారనే వాదన ఉంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*