తప్పించుకున్న మానవ బాంబు కేసు నిందితులు



Want create site? Find Free WordPress Themes and plugins.
హైదరాబాద్ బేగం పేటలో మానవ బాంబు దాడి చేసింది. 2006, అక్టోబరు 16న టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో హోంగార్డు సత్యనారాయణ అక్కడికక్కడే చనిపోగా, కానిస్టేబుల్‌ వెంకటరావుకు తీవ్రగాయాలయ్యాయి. బంగ్లాదేశ్‌కు చెందిన డాలిని ఉగ్రవాద సంస్థ హుజీ ఇక్కడికి తీసుకొచ్చి మానవబాంబుగా మార్చింది. హోంగార్డు ఆ మానవబాంబును ఆపడమే కాదు.. సంచిలో ఏముందో చూసే లోపే అతను తనను తాను పేల్చుకున్నాడు. అంతే ఒక్కసారిగా హైదరాబాద్ లో హై అలెర్ట్ విధించారు. అనుమానిత వ్యక్తులు లోపలకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కేసు పై రెండేళ్లు పరిశోధించి 10 మందిని అరెస్టుచేసి జైలుకు తరలించారు. నిందితులపై కోర్టులో అభియోగపత్రాలు సమర్పించి, విచారణ మొదలుపెట్టారు. వివిధ దశల తర్వాత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాలు లేవు. అందుకే వారిని నిర్దోషులుగా విడుదల చేయాలని చెప్పింది. దీంతో బిత్తరపోవడం పోలీసుల వంతైయింది. 
                     మానవబాంబు దాడి కేసులో మొత్తం 9 మంది నిందితులను నాంపల్లి కోర్టు నిర్దోషిగా తేల్చింది. కేసును కొట్టివేసింది. మొత్తం 20 మంది నిందితులను గుర్తించగా 10 మందిని అరెస్ట్‌ చేశారు. ముగ్గురు పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. నిందితుల్లో కొంత మంది 11 ఏళ్లుగా జైలులో ఉండగా… మరికొందరు ఏడేళ్లుగా కారాగారవాసం గడుపుతున్నారు. జిల్లా కోర్టు ఈ తీర్పు ఇవ్వడంతో ప్రాసిక్యూషన్‌ హైకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తప్పు చేసినట్లు భావిస్తున్న వ్యక్తులకు శిక్ష పడకపోతే అది మరింతగా ఇబ్బంది వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే హైకోర్టుకు వెళ్లే సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*