కేసీఆర్ కు వ్యతిరేకంగా ఫ్రంట్ కాంగ్రెస్ 



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కలిసి వచ్చే ఏ ఒక్క అంశాన్ని వదలడం లేదు. రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలనే అంశంపై దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్ర ఇంఛార్జ్ డిగ్గీరాజాను తొలగించడంతో సగం దరిద్రం పోయిందనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా అందరినీ కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో మిగతా పార్టీలన్నింటినీ కలిపి ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్. టీడీపీ, సీపీఐ, సీపీఎంతో పాటు.. కోదండరామ్ పార్టీ పెడితే ఆయనతో కలిసిపోయేందుకు సిద్దమనే సంకేతాలిస్తోంది. ఇప్పటికే ఉభయ కమ్యూనిస్టు పార్టీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయంటున్నారు. తమలో ఎవరు సిఎం అవుతారనే అంశాన్ని పక్కన పెట్టి ఐక్యంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాడేందుకు హస్తం పార్టీ సన్నద్దమవుతోంది. 
          నేరేళ్ల ఘటనలో తెలంగాణ ప్రభుత్వం తీరును ఎండగట్టడంలో కాంగ్రెస్ ముందుంది. అదే సమయంలో ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి బాధితులకు న్యాయం జరిగేలా చూసేందుకు సమాయత్తమవుతోంది. దళితులను చితక బాదడమే కాదు.. సంసారానికి పనికి రాకుండా చేసేందుకు టీఆర్ఎస్ పోలీసులను పావులుగా వాడుకుందనే ప్రచారం ఉంది. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం అక్రమ ఇసుక మాఫియా కోసమే ఇదంతా చేయించారనే వాదన లేకపోలేదు. దీంతో కేసీఆర్ సర్కారు దిద్దుబాటుకు దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. కేటీఆర్ బాధితులను పరామర్శించిన వారు గులాబీ నేతలను నమ్మడంలేదు. దళితులకు సి.ఎం పదవి ఇస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసిన కేసీఆర్ ఆచరణలో ఇందుకు విరుద్దంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అసలు తాను ఆ మాటలు అనలేదని చెప్పారు కేసీఆర్. కానీ ఇప్పుడు దళితులను కొట్టించడం వివాదాన్ని పెంచింది. ఈ సంఘటన దళితుల్లో కేసీఆర్ వ్యతిరేక వైఖరిని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తోంది కాంగ్రెస్. అందుకే కేసీఆర్ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పని చేస్తోంది. ఎంత వరకు వారి ఎత్తులు పని చేస్తాయో చూడాలి.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*