భర్త వేధిస్తున్నాడంటున్న గాయని కౌసల్య



Want create site? Find Free WordPress Themes and plugins.
సింగర్ సునీత ఇప్పటికే ఓపెన్ అయ్యారు. తన భర్త వేధిస్తున్నాడని.. అందుకే విడిపోయానని చెప్పింది. భర్త కిరణ్ తో కలిసి ఆమెకు కొడుకు, కూతురు ఉన్నారు. ఇప్పుడు పిల్లలతో కలిసి ఆమె విడిగా ఉంటున్నారు. ఇప్పుడు మరో సింగర్ కౌసల్య వంతు వచ్చింది. తన భర్తతో ఆరేళ్ల పాటు కలిసి జీవించాను. ఇక తన వల్ల కాదని తేల్చింది. తనను భర్త మానసికంగానే కాదు.. శారీరకంగాను హింసించేవాడని చెప్పుకొచ్చింది. అందుకే కలిసి ఉండలేనని చెప్పింది. రోజు కొడితే ఏభార్య అయినా ఊరుకుంటుందా అని ప్రశ్నించింది. తెలుగు గాయనీమణుల కుటుంబ కెరీర్ ఇలా అర్థంతరంగా ఆగడం ఇప్పుడు హాట్ టాపికైంది.
       గుంటూరు జిల్లాకు చెందిన కౌసల్య.. అదే జిల్లాకు చెందిన చిన్ననాటి స్నేహితుడు సుబ్రమణ్యంను పెళ్లి చేసుకుంది. వారిద్దరికి ఒక పిల్లోడు ఉన్నాడు. అయినా తనను భర్త వేధిస్తున్నాడని.. హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తన డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. ఇంకా కట్నం తెమ్మంటున్నాడని పోలీసులుకు ఫిర్యాదు చేసింది కౌసల్య. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఎదిగి వచ్చిన వారు ఇలా వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడటం ఆశ్చర్యమే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*