నంద్యాలలో బాలయ్య ఎంట్రీ



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి నందమూరి అందగాడు బాలయ్య రానున్నాడు. ఈ మేరకు సి.ఎం చంద్రబాబునాయుడు తమ పార్టీ నేతలకు సమాచారం చేరవేశాడు. ఇప్పటికే సి.ఎం చంద్రబాబునాయుడు రెండు సార్లు నంద్యాలలో పర్యటించి వెళ్లారు. నారా లోకేష్ ఒకసారి నంద్యాలలో పర్యటించగా.. మరోసారి అక్కడ అడుగు పెట్టి క్యాడర్ లో ఉత్సాహం నింపనున్నాడు. ఇప్పుడు లోకేష్ తో పాటు.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అక్కడ అడుగు పెట్టనున్నాడు. దీంతో నంద్యాలలో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తాము చేస్తున్న అభివృద్ధి పనుల గురించి బాగా ప్రస్తావించాలని.. సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని సి.ఎం చంద్రబాబునాయుడు తమ క్యాడర్ కు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇదే సమయంలో బాలయ్య రాక తమకు బాగా లాభిస్తుందని అంచనా వేస్తోంది టీడీపీ. మరోవైపు విపక్ష నేత జగన్ బుధవారం నుంచి నంద్యాలలోనే మకాం వేసి.. గెలుపు కసరత్తులు చేయడం ఉత్కంఠను పెంచుతోంది. 
                     ప్రధాన పార్టీల అభ్యుర్థులు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్, బైరెడ్డి నేతృత్వంలోని రాయలసీమ సమితి నేత బరిలోకి దిగడం మిగతా వారిని ప్రభావితం చేయనుంది. రోజా పర్యటన బెడిసి కొట్టడంతో ఇప్పుడు బాలయ్య టూర్ ఎలా ఉంటుందోనన్న చర్చ సాగుతోంది. కావాలని రోజా మీదకు టీడీపీ నేతలు మహిళలను ఉసిగొల్పారనే వాదన రాగా.. అదంతా ప్రజల నుంచి వచ్చిందే.. ఆ వ్యతిరేకతను కల్పిస్తే వచ్చేది కాదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. భూమా బ్రహ్మానందరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిలు హోరా హోరీగా తలపడుతున్న సమరంలో వంద కోట్లు ఖర్చు అవుతుందని రాజకీయ నేతల అంచనా.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*