వైభవంగా జరిగిన విశ్వకర్మ ఫ్యామిలీ మీట్



Want create site? Find Free WordPress Themes and plugins.
అమెరికాలో విశ్వకర్మ ఫ్యామిలీ మీట్ వైభవంగా జరిగింది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లోని హెల్లెయర్ కౌంటీ పార్క్ లోని బటిస్టా పిక్ సైట్ లో జరిగిన ఈ మీట్ కు విశ్వకర్మ కుటుంబాలు పాల్గొని ఆనందంగా గడిపాయి. ఆగస్టు 5న ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మీట్ సాయంత్రం వరకు కొనసాగింది. విశ్వకర్మ కుటుంబాలు అన్నీ ఈ వేడుకల్లో పాల్గొని సంబరాలు చేసుకున్నాయి. ఆత్మీయంగా పలకరించుకున్నాయి. ఎప్పుడు బిజీ జీవితాలతో ఉన్న కుటుంబాలన్నీ కలవడం ఒక ఎత్తయితే.. అంతా ఐకమత్యాన్ని చాటడం మరో ఎత్తు. 
                     వివిధ ప్రాంతాల్లో ఉండే కుటుంబాలన్నీ కలవడంతో వారి మధ్య మరింతగా సంబంధ బాంధావ్యాలు పెరిగాయి. భగవాన్ విశ్వకర్మకు దీపారాధన చేయడంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రమేష్ తంగెళ్లపల్లి, వెంకట్ చలపతి, ఓం, జంగయ్య, చారి, అమరనాధ్ చిన్నోజు వంటి వారు దీపం వెలిగించి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా.. మిగతా వారు చప్పట్లతో వారిని స్వాగతించారు. రమేష్ తంగెళ్లపల్లి విశ్వకర్మ కుటుంబ చరిత్ర గురించి ప్రస్తావించగా.. మిగతా వారు తమ కుటుంబాలు ఎక్కడ ఉంటుంది. ఏం చేస్తుంది. తమ జాతి ఐక్యత కోసం తీసుకోవాల్సిన అంశాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా మీట్ అయిన వారంతా తమను తాము పరిచయం చేసుకున్నారు. 
                    ఈ సందర్భంగా వీణ గుండవల్లి  www.vishwakarmafamily.org పేరుతో వెబ్ సైట్ ను ప్రారంభించారు. అంతా కలిసి కూర్చుని భోజనాలు చేశాక..పాటలు, ఆటల పోటీల్లో అంతా పాల్గొన్నారు. కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. అలానే వివిధ పాటలను పెట్టుకుని అంతా ఆనందించారు. ఇండియానా పోలీస్ నుంచి వచ్చిన వెంకట్ చలపతితో పాటు..100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో అనుభూతులను పొందారు. భవిష్యత్ లో ఇలాంటి మరెన్నో ఆత్మీయ సమ్మేళనాలు జరగాలని విశ్వకర్మ కుటుంబీకులు కోరారు. రమేష్ తంగెళ్లపల్లి ఈ వేడుకలకు నేతృత్వం వహించగా..గట్టిపల్లి, శివరాపు, వీరయ్య గారి, గుండవెల్లి విశ్వకర్మ కుటుంబాలు వారికి అండగా నిలిచాయి. తమ విలువైన సమయం వెచ్చించడమే కాకుండా విశ్వకర్మ కుటుంబాల్లో ఉన్న ఐకమత్యాన్ని ప్రదర్శించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు రమేష్ తంగెళ్లపల్లి. అదే విధంగా ఈ కార్యక్రమానికి  తమ సహాయం, సేవలందించిన రాజేష్ మల్లం, రామ్ సేన్ బొజ్జా, కాసుల వేణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*