ఫిల్మ్ చాంబర్ పై వర్మ గురి



Want create site? Find Free WordPress Themes and plugins.
వివాదస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మరోసారి బహిరంగ లేఖ రాశారు. ఈసారి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు ఆ లేఖ రాయడం మరింత విచిత్రం. అతికొద్దిమంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరమని ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సిట్ అధికారులకు లేఖ రాసింది. అసలు ఏమిటిది? ఎవరు చెప్పారు మీకు ఎవరు పొరపాట్లు చేసారో… అసలు వాళ్లు చేసిన నేరమేమిటో, దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటో చెప్పకుండా ఇదేంటి అని ప్రశ్నించారు. అంతే కాదు…వాళ్లు అప్పుడే ఏదో మహా నేరం చేసినట్టు కలర్ ఇచ్చిన అధికారులపై ఆగ్రహించాల్సింది పోయి ఆల్రెడీ నేరం ఋజువైందనే ధోరణిలో క్షమాపణలేఖ పంపించడంలో అర్థం ఏమిటి? అలాగే నోటీసులు అందుకున్న వారికి నా విన్నపం అంటూ సుదీర్ఘ లేఖ రాశారు రాం గోపాల్ వర్మ. మీలో ఏ మాత్రం పౌరుషం ఉన్నా, మీ పైన వచ్చిన ఆరోపణల వల్ల మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పడిన మానసికవేదనపై మీరు మాట్లాడాలని కోరారు వర్మ. కేసులు బనాయించి చట్టం చట్రంలో మరింత బలంగా బిగిస్తారేమో అనే భయంతో మాట్లాడలేకపోతే అంతకు మించిన పిరికితనం మరొకటి ఉండదు. అది ప్రజాస్వామ్యానికే అవమానం. అందుకే అంతా మాట్లాడాలని కోరారు వర్మ. 
                         వీళ్ల తప్పు లేదని తెలిస్తే ఛాంబర్ బహిరంగ క్షమాపణలేఖ రాయాలన్నారు. ఇలా చెయ్యని పక్షంలో భావి చరిత్రలో వీళ్లందరూ నిజంగా నేరస్థులేనని… కానీ ఫిల్మ్ ఛాంబర్ చెప్పిన క్షమాపణ మూలానే క్షమించి వదిలేసారనే అబద్ధం నిజంగా నిలిచిపోతుంది. ఆ అబద్ధం నిజం కాకుండా చూడాల్సిన నైతిక బాధ్యత ఫిల్మ్ ఛాంబర్ కి ఉందని గౌరవపూర్వకంగా తెలియచేసుకుంటున్నాను.’ అని బహిరంగ లేఖను విడుదల చేశారు వర్మ. దీంతో ఇప్పుడు వర్మ బాంబుపై సినీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. కేసు విచారణలో ఉన్నప్పుడు కొందరు తప్పు చేశారని ఎలా చెబుతారనేది వర్మ ప్రశ్న. నిజమే. అలాంటి సమయంలో ఫిల్మ్ చాంబర్ పెద్దలు.. బహిరంగ లేఖ ద్వారా కాకుండా మరో ప్రయత్నం చేసి ఉండాల్సిందనే వాదన ఉంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*