జయశంకర్ జయంతి వేడుకల్లో బహరేన్ టిఆర్ఎస్



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణా జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి 83వ జయంతి వేడుకలను ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహరేన్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకొని అనంతరం ఆండాల్స్ గార్డెన్ లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మూడో విడత ఆకుపచ్చ హరితహారం బహరేన్ లో మొక్కలు నాటి హరితహారం నిర్వహించరు. అనంతరం ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ లు మాట్లాడుతు జయశంకర్ సార్ మహోన్నతమైన వ్యక్తి అని సార్ సేవలను కొనియాడారు. ప్రతీ సామాజిక అంశంపై పరిశీలన చాలా గొప్పగా ఉండేదని ఆయన చేసిన భావజాల వ్యాప్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను సాధించుకున్నామని జయశంకర్ సార్ పిలుపుతో ఊరూరా కేసీఆర్లు తయారై ఉద్యమాన్ని ముందుకు నడిపారని సార్ జయంతి వేడుకలను గల్ఫ్ దేశాలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీ లింబాద్రి పుప్పల, సెక్రెటరీలు సుమన్ అన్నారం, రవిపటేల్ దెషెట్టి, జాయంట్ సెక్రెటరీలు సంజీవ్ బురమ్, విజయ్ ఉండింటి, ప్రమోద్ బోలిశెట్టి, తదితరులు పాల్గొన్నారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*