చంద్రబాబును కలిసిన ఉపాధ్యాయులు



Want create site? Find Free WordPress Themes and plugins.
ఎయిడెడ్ టీచర్ల గ్రాట్యిటూడ్, పదోన్నతుల విషయంలో సానుకూలంగా స్పందించినందుకు  టీచర్స్ గిల్డ్ సభ్యులు సి.ఎం చంద్రబాబును కలసి కృృతజ్ఞతలు తెలిపారు. వీటితో పాటు మరికొన్ని అంశాల్లోనూ అవకాశం కల్పించాలని ఎయిడెడ్ టీచర్స్ గిల్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విక్టర్ ఇమ్మాన్యుయేల్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చారు. హెల్త్ కార్డులతో పాటు… ఇప్పటి వరకు తాము నష్టపోయినందుకు పరిహారం ఇప్పించాలని కోరారు. అంతే కాదు… జీవో నెంబర్ 37/ 2005ను రద్దు చేసి అన్ ఎయిడెడ్ సర్వీస్ లను పునరుద్దించాలని కోరారు. 
                     సి.ఎంను కలిసిన వారిలో ఎమ్మెల్సీ రామకృష్ణ, సి.ఎం మురళి, విజయవాడ కరస్పాండెంట్ మరియు టీచర్, చిట్టిబాబు (రాజమండ్రి) టీచర్స్ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెండ్, షేక్షావలి గుంటూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, రాధాకృష్ణ గుంటూరు ప్రెసిడెంట్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సి.ఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు పంపారు. ఉపాధ్యాయులనే కాదు.. అందరి సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారికి హామీనిచ్చారు. సి.ఎంను కలవడమే కాదు.. వారు స్పందించిన తీరు తమకు బాగా నచ్చిందన్నారు ఏపీ టీచర్స్ గిల్డ్ సభ్యులు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*