బాలయ్యను కలవరిస్తున్న శ్రియ



Want create site? Find Free WordPress Themes and plugins.
పైసావసూల్ చిత్రంలో నందమూరి అందగాడు బాలయ్యతో నటించింది శ్రియ. మూడో సినిమాలో బాలయ్యతో నటించి ఆయన్నే కలవరిస్తుంది. ఎంతగా అంటే.. ఆయనతో నటించడమే నా అదృష్టమంటోంది. చెన్నకేశవ రెడ్డి చిత్రంలో నందమూరి బాలకృష్ణకు జోడీగా నటించింది శ్రియ. ఆ తర్వాత బాలయ్య100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో రెండోసారి జోడీ కట్టింది. ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ నటిస్తున్న 101వ చిత్రం ‘పైసా వసూల్‌’ లోను శ్రియ ఉంది. ఇటీవల కాలంలో మూడు సినిమాల్లో బాలయ్యతో నటించిన వారిలో శ్రియ తర్వాత నయనతారనే ఉన్నారు. సింహా, శ్రీరామదాసుతో పాటు.. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలోను బాలయ్యతో ఆడిపాడనుంది శ్రియ. 
              ‘పైసావసూల్‌’ చిత్రంలో జర్నలిస్ట్‌ పాత్రలో కన్పించనుంది శ్రియ. 100కు పైగా సినిమాల్లో నటించిన బాలకృష్ణతో సినిమాలు చేయడం నా అదృష్టం. ‘పూరీ జగన్నాథ్‌ గొప్ప దర్శకుల్లో ఒకరు. చాలా సినిమాలకు నేను కొత్త దర్శకులతో కలిసి పనిచేశాను. అలా నేను చేసిన ప్రతీ సినిమా ఒక్కో అనుభూతిని మిగిల్చిందని చెప్పారు శ్రియ. ‘వీర భోగ వసంతరాయులు’ చిత్రంలోనూ శ్రియ నటించనుండటం ఇప్పుడు హాట్ టాపికైంది. పైసా వసూల్ సినిమా కోసం బాలయ్యతో కలిసి పోర్చుగల్ వెళ్లిన శ్రియ అక్కడ పరిసరాలను చూసి బాగానే ఎంజాయ్ చేసిందట. మరోవైపు బాలయ్యతోను బాగానే ఉందంటున్నారు. గతంలో విజయశాంతి 13 సినిమాల్లో బాలయ్యతో కలిసి నటించింది. ఇప్పుడు రెండు, మూడు సినిమాల్లో బాలయ్యతో కలిసి నటించడమే హీరోయిన్లకు కష్టమైంది. అలాంటిది ఇద్దరు హీరోయిన్లు చెరి మూడుసినిమాల్లో నటిస్తుండటం విశేషమే మరి.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*