ఐవైఆర్ లేఖల దుమారం



Want create site? Find Free WordPress Themes and plugins.
బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించినా ఇంకా తన తీరు మార్చుకోలేదు ఐవైఆర్ కృష్ణరావు. తాను ఇప్పటికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నట్లుగానే ఆయన చేతలు, మాటలు ఉంటున్నాయి. తాజాగా ఆయన రాసిన లేఖ ఇలానే దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కార్యాలయం (సిఎంఒ) లోని అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు లేఖ రాశారు. ఆ లేఖకు తిరిగి సమాధానం చెప్పాలని కోరారు. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి ఐవైఆర్. తనకు సమాధానం చెప్పకపోతే ఊరుకునేది లేదనే తరహాలో ఆ లేఖలో ప్రస్తావించారు. లేఖ రాయడం వరకు మంచిదే. కానీ నాకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేయడం మరింత విచిత్రం. 
                      సి.ఎంవో కార్యాలయంలో పాలన తీరు సవ్యంగా లేదనేది ఐవైఆర్ ఆరోపణ. దాన్ని నేరుగా చెప్పడంలో తప్పులేదు. ప్రజాధనాన్ని వేతనాలుగా తీసుకుంటున్నా ఉద్యోగులు కొందరు ముఖ్యమంత్రికి సలహాలివ్వడంలోగాని, ఫైళ్లపై సంతకాలు చేయడంలో గాని సరిగా వ్యవహరించడం లేదన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి సంయుక్త కార్యదర్శి వరకు అధికారులెవరూ నిబద్ధతతో పని చేయడం లేదంటున్నారు ఐవైఆర్. సిఎంఒ అధికారులు ఆయా ఫైళ్లను సిఎం కంటే ముందు పరిశీలించి, వాటిపై సంతకాలు చేయాలని, కాని దీన్ని వారెవరూ పాటించడంలేదని విమర్శించారు. కొన్ని ఫైళ్లు ఉన్నతాధికారుల సంతకాలు, పరిశీలన లేకుండానే ముఖ్యమంత్రికి నేరుగా చేరుతున్నాయని చెప్పారు. 
                              సిఎంఒలో సచివాలయ నిర్దేశిత మార్గదర్శకాలను అధికారులు పాటించడంలేదని ఆరోపిచారు. సిఎంకు చేరే ఫైల్లన్నీ రికార్డు చేయాలనే నిబంధనను విస్మరిస్తున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి పాలనాపరంగా చేసే సూచనలు కూడా రికార్డు చేయాల్సి ఉంటుందన్నారు. వాటిని సక్రమంగా చేయడంలేదని ఐవైఆర్‌ ఆరోపించారు. ఈ విధానం వల్ల ప్రజా పాలనకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఏపీ సెక్రటేరియేట్‌ ఆఫీస్‌ మ్యాన్యువల్‌ (ఏపీఎస్‌ఒఎం) ప్రకారం సచివాలయంలో పాలన సాగాల్సి ఉందని ఐవైఆర్‌ సూచించారు. ఇది సిఎంఒ అధికారులకూ వర్తిస్తుందని చెప్పారు. వారు ఫైళ్ల రికార్డులను నిర్వహించకపోవడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని తెలిపారు. సిఎంఒ అధికారులు తమకు రాజ్యాంగాధికారాలకు మించి అదనపు అధికారాలున్నట్లు భావిస్తున్నారని తప్పుపట్టారు ఐవైఆర్.
                         కొందరు రాజకీయ నాయకులకు అనుకూలంగా కొన్ని ఫైళ్లను తమకు ఇష్టమొచ్చినట్లు ఆయా శాఖలకు తిరిగి పంపేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కార్యాలయాల నుంచి ప్రధానమంత్రి కార్యాలయాల వరకు ఫైళ్లను నిర్వహించేందుకు రికార్డులుంటాయని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం పరిధిలోనే ఫైళ్లకు రికార్డులు ఉండటంలేదని ఐవైఆర్‌ అభ్యంతరం లేవనెత్తారు. తన పని తీరు బాగోలేక పోవడంతో ఐవైఆర్ ను తప్పించారు సి.ఎం చంద్రబాబునాయుడు. ఇది జీర్ణించుకోలేక లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు మరోవైపు తెలుగు తమ్ముళ్లు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*