కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్…



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి గొంతు పెంచారు. దమ్ముంటే నన్ను జైలుకు పంపండని సవాల్ విసిరారు. అంతే కాదు..కొడుకుల భాష వాడుతున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోలోనే ఉందన్నారు. హీరోయిన్ కు జ్వరం వస్తే వెళ్లి పలకరించే మంత్రి కేటీఆర్.. సిరిసిల్లలో బాధితులుగా మారిన దళితులను ఎందుకు పరామర్శించలేదని దుయ్య బట్టారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక క్వారీల వ్యాపారమంతా కేసిఆర్ బంధువులు, వారి కుటుంబీకులదే ఆరోపించారు. తనది తప్పు అయితే జైలుకు పంపాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. తాను చేసిన ఆరోపణ నిజమో కాదో తేల్చడానికి సిఎం కు 48 గంటల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు రేవంత్ రెడ్డి. తప్పుడు ఆరోపణలు చేస్తే జైలుకు పంపుతానని బెదిరించే సిఎం, దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని కోరడం ఇప్పుడు హాట్ టాపికైంది. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల పోలీసు బాధితులకు సంఘీభావంగా టీడీపీ బస్సుయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ ల పై ఆయన నిప్పులు చెరిగారు. 
కరీంనగర్ జిల్లాలో ఇసుక క్వారీలు కేసిఆర్ బంధువులైన రాజేందర్రావు, ప్రవీణ్ రావు, నడింపల్లి రంగారావు, సంతోష్ రావులవేననిచెప్పారు రేవంత్ రెడ్డి. కేసిఆర్ తొడల్లుని కొడుకైన సంతోష్ రావు వందల కోట్లు సంపాదించుకోవాలని కోరికతో ఇసుక వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. లారీలు తగులబెట్టారనే కారణంతో 8 మందిని చావగొట్టి సంసారానికి పనికిరాకుండా చేశారని చెప్పారు రేవంత్ రెడ్డి. సిరిసిల్లల్లో పోలీసులు దళితులను రోకలిబండతో కొట్టిన సంగతిని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. అందుకే ఆ జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*