వలసదారులపై అమెరికా ఆంక్షలు



Want create site? Find Free WordPress Themes and plugins.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు పిచ్చి పట్టినట్లుంది. అందుకే వలసదారుల పై విరుచుకుపడుతున్నారు. మొన్నటికి మొన్న ఐదు ముస్లిం దేశాల ప్రజలు మా దేశం రావద్దని హుకుం జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ చర్యలను తప్పు పట్టారు ప్రజలు. అయినా వెనక్కు తగ్గలేదు అమెరికా అధినేత. ఆ తర్వాత కోర్టులు లెంపకాయలు వేశాయి. తగ్గలేదు. ఇప్పుడు మరోసారి వలసదారులకు షాక్ ఇచ్చారు ట్రంప్. అమెరికాలోకి వలస వచ్చేవారికి ఐదేళ్ల పాటు ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలు కావని సంచలన ప్రకటన చేశారు. ప్రతివారం నిర్వహించే రేడియో, వెబ్ కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉన్నతంగా కలలు కంటోంది. సాహసోపేతంగా ముందుకు వెళుతోందిని ఇంకా ట్రంప్‌ చెప్పడం ఆశ్చర్యం. 
                                          వీసాల జారీలో అనేక ఆంక్షలు పెడుతున్న అమెరికా ఇప్పుడు వలసలను ఆపేందుకు అడ్డమైన అడ్డగోలు చర్యలకు దిగడం విమర్శలకు తావిస్తోంది. స్వదేశీ జ్ఞానాన్ని పెంచేందుకు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకునేందుకే ఈ పని చేస్తున్నట్లు చెప్పినా..వాస్తవం ఇందుకు విరుద్దంగా ఉంది. విదేశాల వారు అమెరికా మీద పడి..స్థానికుల ఉపాధికి గండి కొడుతున్నారనే అభిప్రాయంలో ఉన్నారు ట్రంప్. ఎన్నికల సమయంలోను ఇదే మాట చెప్పారు. వలసదారులకు అడ్డుకట్ట వేస్తానని చెప్పిన ట్రంప్ చివరకు అదే పని చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే..రాబోయే కాలంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారోనని ఎన్నారైలు ఆందోళన చెందుతున్నారు
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*