బిర్యానీ పాకెట్ రూ.500 నోటుWant create site? Find Free WordPress Themes and plugins.
జగన్ సభతో పాటు… వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి బిర్యానీ పాకెట్ తో పాటు.. రూ.500ను పంచినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఏమోగానీ తమకు నాలుగు రోజులు ఉపాధి దొరుకుతుందని ప్రజలు ఆనందపడుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక జనాలకు వరంగా మారింది. పార్టీ ఏదైనా మీటింగ్ కు జనం కావాలంటే తరలించే వారున్నారు. జగన్ సభకు అలానే జనాలను తరలించినట్లు సమాచారం. జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌కు జ‌నాల‌ను త‌రలించేందుకు భారీగా డ‌బ్బులు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి నామినేష‌న్ దాఖలు చేశారు. ఈ నామినేష‌న్‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో పాటు ఆ పార్టీ రాష్ట్ర నేత‌లు, సీనియ‌ర్ లీడ‌ర్లు  హాజ‌ర‌య్యారు.
        అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి డబ్బులు పంచే కార్యక్రమాన్ని కొందరు యువ నేతలకు అప్పగించారు. వారిలో ఆ నాయ‌కుడి సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి వారికి రూ. ల‌క్ష నుంచి రూ. 10 లక్ష‌ల వ‌ర‌కు ప్యాకేజీ ఇచ్చారట. అదే సమయంలో స‌భ‌కు వ‌చ్చిన వారికి రూ. 500 నోటుతో పాటు కొన్ని చోట్ల బిర్యానీ ప్యాకేట్లు కూడా ఇచ్చారు. మ‌హిళ‌లు స‌భ‌కు వ‌చ్చేందుకు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో వైసీపీ గెలిస్తే ఇళ్ల స్థలాల‌తో పాటు ఉచితంగా ఇళ్లు క‌ట్టిస్తామ‌ని చెబుతోంది. ఏదో ఒక రకంగా జనాలను ఆకట్టుకునేందుకు వైసీపీ వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు హాట్ టాపికయ్యాయి.
Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

  1. Rey ap lo ye place aina jagan vastey janalatho kikkirisi potadi kallu dobbaya ?
    Biryani packet akkadey yevaru tisukunnaro photo teesi interview chesi pettachu kada
    Edi rayataniki nuvvu yenta tisukunnavu

Leave a Reply

Your email address will not be published.


*