ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమని ఎందుకు చెప్పారంటే



Want create site? Find Free WordPress Themes and plugins.
తమ పార్టీలో చేరేటప్పుడు శిల్పా చక్రపాణిరెడ్డికి వైసీపీ అధినేత జగన్ ఒక షరతు విధించారట. ముందుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేరాలనేది నిబంధన. ఇందుకు కాస్తంత తటపటాయిస్తూనే ఓకే చెప్పారట చక్రపాణిరెడ్డి. పార్టీ పదవికి రాజీనామా చేసిన చక్రపాణిరెడ్డి ఇంకా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదు. కానీ కచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. తమ పార్టీ నేతలను టీడీపీ చేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ముందుగా పదవులకు రాజీనామా చేసిన తర్వాతనే… ఆ పార్టీకి వెళ్లాలని జగన్ డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ పదవికి వచ్చిన ఎమ్మెల్సీని చేర్చుకుంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించారట. అందుకే చక్రపాణిరెడ్డిని రాజీనామా చేయాలని కోరినట్లు తెలుస్తోంది. టీడీపీ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే సరే. లేక పోతే జగన్ పార్టీ నేతలు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 
                 తెలంగాణలో తమ పార్టీ నేతలను కేసీఆర్ తీసుకోవడంపై టీడీపీ నిప్పులు చెరిగింది. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకునేటప్పుడు పల్లెత్తు మాట అనలేదు. అప్పుడు, ఇప్పుడు జగన్ ఆ పార్టీలను విమర్శిస్తూ వస్తున్నాడు. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీని తాను చేర్చుకుంటే మిగతా వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందనుకున్నాడు. అందుకే ముందుగా టీడీపీ, ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని కోరాడట. నంద్యాల ఉప ఎన్నికల నేపధ్యంలో చక్రపాణిరెడ్డి పార్టీని వీడటం తమకు మంచిదైందని టీడీపీ నేతలు చెబుతుండగా.. ఆయన చేరిక తమలో బలం పెంచిందంటున్నారు ఇంకోవైపు జగన్ పార్టీ నేతలు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*