వసూళ్లల్లో రికార్డులను చెరిపేస్తున్న ఫిదా



Want create site? Find Free WordPress Themes and plugins.
శేఖర్ కమ్ముల తీసిన ఫిదా వసూళ్లు కుమ్మేస్తోంది. ఎంతగా అంటే గత రికార్డులను చెరిపేస్తోంది. ఇండియాలోనే కాదు.. విదేశాల్లోను ఇరగదీస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించింది. అదే సమయంలో హీరోయిన్ సాయి పల్లవి నటన సావిత్రిని గుర్తుకు తెచ్చింది. ప్రముఖ నటుడు నాగబాబు ఇదే విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ఫిదా దెబ్బకు మిగతా సినిమాలు తేలేశాయి. ఫిదా తర్వాత విడుదలైన గౌతమ్ నంద వంటి సినిమాలు ఆదరణ పొందకపోడవం మరింతగా కలిసి వచ్చింది. పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమావసూళ్లు ఇప్పటికి యాభై కోట్ల రూపాయల మార్కును దాటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఫిదా కలెక్షన్లు రూ. 53 కోట్లను దాటిందని చెబుతున్నారు. ఇదే సమయంలో వరుణ్ తేజ్ సినిమా మెగా ఫ్యామిలీ హీరోల వసూళ్ల రికార్డులను చెరిపే అవకాశముందంటున్నారు. ఓవర్సీస్ వసూళ్ల విషయంలో ఫిదా టాప్ రేంజ్ లో ఉంది. ఫిదా 1.62 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించినట్టు సమాచారం. తెలుగు అర్థం కాని వారు సైతం ఫిదా బాగుందని కితాబునిస్తున్నారు. సహజత్వానికి దగ్గరగా ఉండేపాత్రలతో శేఖర్ కమ్ముల తీసిన విధానం అందరికీ నచ్చుతోంది
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*