అదిరిన యుద్ధం శరణం… టీజర్ 



Want create site? Find Free WordPress Themes and plugins.
అక్కినేని అబ్బాయి నాగ చైతన్యకు ఇప్పటి వరకు పెద్దగా యాక్షన్ చిత్రాలు కలిసిరాలేదు. రొమాంటిక్, క్లాస్ చిత్రాలే ఆయనను నిలబెట్టాయి. కానీ సాయి కొర్రపాటి కృష్ణ తమిళ దర్శకుడు మరిముత్తుతో తీస్తున్న యుద్ధం శరణంతో ఆకట్టుకోనున్నాడు. ఈ చిత్రం టీజర్ చాలా బాగుంది. ఇది ధైర్యం కాదు.. తెగింపు అంటూ నాగ చైతన్య చెప్పిన సింగిల్ డైలాగ్ అదరగొట్టింది. మనం బతకాలంటే.. వాడికి ఎదురెళ్లాలి.. అది ధైర్యం కాదు.. తెగింపు’ అని చైతన్య కేక పెట్టాడు. నాగ చైతన్యతో పాటు.. లావణ్య త్రిపాఠి హాట్ అందాలు ఆలరించనున్నాయి. 
                    ఇందులో శ్రీకాంత్ విలనిజం బాగుంటుందంటున్నారు. పెళ్ళిచూపులు ఫేమ్ వివేక్ సాగర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఈ సినిమా బాగా వచ్చేందుకు డ్రోన్లను వాడారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తీక్ ఇందుకు తనవంతుగా సాయం చేసినట్లు తెలుస్తోంది. సాయి కొర్రపాటి నిర్మాతగా ఉన్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షుకుల ముందుకు రానుంది. యుద్ధం శరణం తన సత్తా చాటనున్న చైతు ఆ తర్వాత సమంతను పెళ్లి చేసుకుని విహార యాత్రలకు వెళ్లబోతున్నాడు. 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*