బిగ్ బాస్ లో తన అందాలతో ఆకట్టుకున్న దీక్ష



Want create site? Find Free WordPress Themes and plugins.
బిగ్ బాస్ ఇంట్లో ఎవరూ ఇంకా లేవలేదు. వారు ఎవరు చూడకుండానే ఇంట్లోకి అడుగుపెట్టింది సెలబ్రిటీ దీక్ష. అలా వెళ్లిందో లేదో.. సిమ్మింగ్ పూల్ లోకి దిగింది. తొలిగా శివబాలాజీ ఆమెను సిమ్మింగ్ పూల్ లో చూసి ఫిదా అయ్యాడు. ఆమె ఎవరు ఎందుకు వచ్చింది.. తెలియక కాస్తంత ఆశ్చర్యంగా చూశాడు. ప్రిన్స్, ఆదర్శ్, మహేష్ కత్తి, సమీర్, ధన్ రాజ్ లకు షాక్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ‌తో బిగ్ బాస్ కు వచ్చిన దీక్ష తన అందాలతో ఆకట్టుకుంది. రెండు వారాల పాటు దీక్ష బయట నుంచి షో చూసింది. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకుంది. అందుకే చాలా జాగ్రత్తగా బిగ్ బాస్ ఇంట్లో పావులు కదుపుతోంది. ఆమె చాలా తెలివి కలది.కానీ కాస్తంత సెన్సిటివ్ అని ధన్ రాజ్ మిగతా వారికి చెప్పేశాడు. అన్నీ చాలా జాగ్రత్తగా గమనిస్తుందని చెప్పాడు. ఇంకోవైపు దీక్ష చేయి పట్టుకుని ఇంట్లో అంతా తిప్పాడు ప్రిన్స్.  
                    మరోవైపు ఎలిమినేషన్ కు ఎవరిని పంపిస్తారంటూ బిగ్ బాస్ అడిగిన ప్రశ్నలకు వారంతా సమాధానాలు చెప్పారు. ఒక్కో సెలబ్రిటీని డార్క్‌కి పిలిచి బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లకుండా ఎవరిని ప్రపోజ్ చేస్తావని అడిగారు. అర్చన.. సమీర్, శివబాలాజీని సేవ్ చేయగా.. ఆదర్శ్.. కత్తి కార్తీక, ముమైత్ ఖాన్‌ని, హరితేజ.. అర్చన, కత్తి కార్తీకని, ముమైత్.. శివ బాలాజీ,అర్చనని, సమీర్.. అర్చన, హరితేజని, మహేష్ కత్తి.. హరితేజ, ధనరాజ్‌ని, కత్తి కార్తీక.. ధనరాజ్, కల్పనను, దీక్ష.. కత్తి కార్తీక, కల్పనను, శివబాలాజీ.. సమీర్, హరితేజను, ధనరాజ్.. మహేష్ కత్తి, ఆదర్శ్‌లను, కల్పన.. కత్తి కార్తీక, ఆదర్శ్‌ను, ప్రిన్స్.. ఆదర్శ్, అర్చనలను ఇంట్లో ఉండేందుకు ఎన్నుకున్నారు.
                    వారు చెప్పింది విన్న బిగ్ బాస్ చివరగా శివబాలాజీ, సమీర్, ముమైత్, మహేష్ కత్తి, ధనరాజ్, కల్పనలు ఎలిమినేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. ధనరాజ్‌ను బిగ్ బాస్ డార్క్ రూంలోకి పిలిచి మాట్లాడారు. తన భార్య ప్రస్తుతం 8 నెలల నిండు గర్భిణి అని తనను పంపాలని కోరారు. కనీసం తన భార్యతో మాట్లాడించే ప్రయత్నం చేయాలని అడిగారు. ఈ సందర్భంగా కాస్తంత ఉద్వేగానికి గురయ్యారు ధన్ రాజ్. బిగ్ బాస్ హౌస్‌కి వచ్చి నేను మామూలు మనిషిగా అంటే తన భార్య నన్ను ఎలా చూడాలనుకుందో అలా మారానని చెప్పాడు. మీ భార్య చాలా ఆరోగ్యంగా ఉందని ఆమెను మీకు ఓ వీడియో ద్వారా చూపిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ధన్ రాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు జీవితంలో లైఫ్ ఇచ్చింది మొదటగా సుకుమార్.. ఆ తర్వాత మోహన్. ఇప్పుడు బిగ్ బాస్ అంటూ కన్నీళ్లు కార్చారు ధన్ రాజ్. 
                   హౌస్‌లోకి కొత్తగా వచ్చిన దీక్ష కోసం మగాళ్లందరికీ డాన్స్ చేసే సరదా టాస్క్‌ను ఇచ్చారు బిగ్ బాస్. అంతే రెచ్చిపోయి డాన్స్ చేసేశారు కొందరు. ప్రిన్స్ అయితే షర్ట్ తీసిమరీ వీర లెవల్లో ఎక్స్‌పోజింగ్ చేస్తూ దీక్షను ఇంప్రెస్ చేయడానికి యత్నించాడు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*