అందరినీ ఒకచోట చేర్చిన తెలంగాణ బోనాలు, వన భోజనాలు



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన బోనాలు, వనభోజనాలు అందరినీ సంబురాల్లో ముంచెత్తాయి. అమెరికాలోని బే ఏరియాలో జరిగిన వనభోజనాల్లో వందలాది కుటుంబాలు కలిసి మెలిసి చేసుకున్న ఈ వేడుకలు వారిలో ఐక్యమత్యాన్ని తీసుకువచ్చాయి. వందలాది మంది తెలుగువారు ఈ సంబరాల్లో పాల్గొని ఎప్పటికీ గుర్తుండి పోయేలా స్మృతులను మిగుల్చుకున్నారు. కాలిపోర్నియాలోని బే ఏరియా షాడో క్లిప్స్ రీజనల్ పార్క్ లో జరిగిన ఈ వేడుకలకు చిన్నా పెద్దా అంతా హాజరయ్యారు. తెలంగాణ నుంచి వచ్చిన అతిథులు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
                       ఎప్పుడు ఉద్యోగాలతో క్షణం తీరిక లేకుండా ఉండే కుటుంబాలంతా కలిసి మెలిసి తెలంగాణ వంటకాలు చేసి తీసుకు వచ్చారు. అందరూ పంచుకున్నారు. తమలో ఉన్న ఐకమత్యాన్ని చాటుకున్నారు. సంప్రదాయ వంటకాలే కాదు.. భారత్ కు చెందిన పలురకాల వంటకాలను చేయడం విశేషం. పల్లె వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా పకృతి పులకరించేలా ఈ వనభోజనాల కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా చిన్న చిన్న ఆటలు, పాటల పోటీలు జరిగాయి. ఇందులో గెలిచిన చిన్నారులకే కాదు.. పెద్దలకు బహుమతులను ప్రదానం చేశారు. మ్యూజికల్ చైర్స్, స్పూన్ పై ద్రాక్ష కాయలను పెట్టి పరుగెత్తడం, టగ్ ఆఫ్ వార్ తో పాటు.. తెలంగాణకు సంబంధించిన క్విజ్ పోటీలు నిర్వహించారు. సంబరాలకు హాజరైన వారిలో బెస్ట్ కపుల్ పోటీలు నిర్వహించి వారికి టీసీఏ పక్షాన మూడు బహుమతులు ప్రదానం చేయడం విశేషం. తెలంగాణ వంటకాలు, ఆహారం బాగా తయారు చేసిన వారికే కాదు… మంచి బహుమానాలు ఇచ్చి అభినందించారు. 
                          తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు ధనుంజయ్ రెడ్డి బోడా, ఉపాధ్యక్షులు మహిపాల్ అన్నం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గుజ్జు, ట్రెజరర్ సాగర్ కొత్త, కల్చరల్ సెక్రటరీ వినయ్ ఎం తదితరులు వనభోజనాల కార్యక్రమాలకు హాజరైన కుటుంబాలకు అవసరమైన సేవలందించారు. వారిని ప్రొత్సహించారు. హరీష్ బి. శివ, సుశీల్ కాప్రబోయిన, సబితారెడ్డి బోడ, రేవంత్ రెడ్డి బోడ, భాస్కర్ మద్ది, ప్రసన్న మద్దినేని, మంజుల గుజ్జు, మాధవి అన్నం, శ్రీమయి అన్నం, రేణుక చావా, జ్యోతి చిగుళ్ల పల్లి, కిషోర్ కే. బిక్షం బి, వేణు సూరకంటి, రమేష్ చిమ్మాని, ఉదయ్ జొన్నల, సతీష్ రాయపూడి, కృష్ణ వేముల, భాస్కర్ కాల్వ, సదానందం కనికరం తదితరులు లేకపోతే ఈ కార్యక్రమం అంత సక్సెస్ అయ్యేది కాదు. విజయ్ చావా, బిక్షం పాలబిందెల, బుచ్చన్న గాజుల, టీసీఏ చైర్ పర్సన్ చంద్రకళ సి టీసీఏ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు విజయలక్ష్మీ కనికరం తదితరులు బే ఏరియాలో ఉంటున్న తెలుగువారి నాయకత్వ లక్షణాలను అభినందించారు.  
బోనాల సందడి…
               వనభోజనాలతోనే కాదు.. బోనాలతోను తెలంగాణ తెలుగు వారు ఆకట్టుకున్నారు. తమ సంస్కృతి సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా ఆడి పాడారు. బే ఏరియాలోని శివ విష్ణు దేవాలయం(కనకదుర్గ దేవాలయం) వద్ద నిర్వహించిన బోనాలు అలరించాయి. డప్పుతోపాటు.. సంప్రదాయ గీతాలకు చేసిన నృత్యాలు చూసేందుకు రెండు కళ్లు చాలలేదు. మాధావి అన్నం, ప్రసన్న మద్దినేని, అనిత్ మాదాసు తో పాటు..రేణుక చావా, వాసవి మద్ది, రేఖ, రాణిలు ఇందులో కీలక పాత్ర పోషించారు. టీసీఏ వాలంటీర్ సభ్యులు శ్రీనివాస్ గుజ్జు, హరీష్ బి. ధనుంజయ్ బోడ, మహిపాల్ అన్నం, వినయ్, సాగర్ కొత్త, విజయ్ చావా, బాస్కర్ మద్ది, సదానందం కనికరం తదితరులు వారికి సహకరించారు. భాస్కర్ కాల్వ, ఉదయ్ మాధవితో పాటు.. లివర్ మోర్ టెంపుల్ కమిటీ సభ్యులు వేణు సూరకంటి, రమణ, మాధవ, ఆనంద్, సాయినాధ్ తదితరులు తమ వంతుగా సేవలందించారు. టీసీఏ నిర్వహించిన ఈ సంబరాల్లో బే ఏరియాకు చెందిన తెలుగువారంతా పాల్గొనడం విశేషం. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*