చంద్రబాబును కలవనున్న పవన్ కల్యాణ్



Want create site? Find Free WordPress Themes and plugins.
సి.ఎం చంద్రబాబునాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఉద్దానం సమస్యలపై వారిద్దరు మాట్లాడుకుంటారని చెప్పారు అధికారులు. కానీ పైకి అది చెబుతున్నా.. తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించుకోనున్నారు. పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడం వల్ల గత ఎన్నికల్లో టీడీపీకి ప్రయోజనం చేకూరింది. మరోసారి అదే తరహాలో మద్దతు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరనున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందే వారిద్దరి మధ్య బేటీ జరగాల్సి ఉన్నా వాయిదా పడింది. ఇంకోవైపు ఉద్దానం సమస్యను సానుకూలంగా చూడడమే కాకుండా పవన్ కల్యాణ్ కు మైలేజ్ వచ్చేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రూ.2500 పింఛన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. మరోవైపు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన నిపుణులు ప్రత్యేకంగా ఉద్దానంపై పరిశోధన చేస్తున్నారు. ఇది టీడీపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ కు సానుకూల అంశమే. 
                         వెంకయ్యనాయుడు రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆ మేరకు చంద్రబాబుకు కుడి భుజం పోయినట్లుగా ఉంది. పార్టీ వేరైనా కేంద్రం నుంచి నిధులు రప్పించే విషయంలో వెంకయ్య అండదండగా ఉండేవారు. ఇప్పుడు ఆపరిస్థితి లేకపోవడంతో సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు. మరోవైపు క్యాడర్ కు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ జరగనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. చిరంజీవి క్రియా శీల రాజకీయాల్లో చురుగ్గా లేకపోవడం వారిద్దరి మధ్య చర్చకు వచ్చే వీలుంది. వైసీపీ-బీజేపీలు పొత్తు పెట్టుకునే అంశంతో పాటు.. ఏపీ బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చర్చకు వచ్చే వీలుంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*