పాక్ ప్రధాని రాజీనామాతో ఉత్కంఠ



Want create site? Find Free WordPress Themes and plugins.
 
     పాకిస్తాన్ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు. వారి క్రికెట్ టీమ్ అంతే. ఎప్పుడు గెలుస్తుందో..మరెప్పుడు ఓడుతుందో అర్థం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆ దేశ సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. పనామా కుంభకోణంలో షరీప్ పై ఆరోపణలు వచ్చాయి. లండన్ లో ఆస్తుల కొనుగోలు, తదితర అంశాలను పనామా పత్రాలు బయట పెట్టాయి. దీనిపై విచారించిన పాక్ సుప్రీంకోర్టు షరీప్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పాక్ ప్రధాని పదవికి నవాజ్ షరీఫ్ రాజీనామా చేశారు. కొత్త ప్రధాని ఎంపికపై కసరత్తు సాగుతోంది. నవాజ్ షరీఫ్ సోదరుడు షెహనాజ్ షరీఫ్, రక్షణమంత్రి అసిఫ్ ల పేర్లు ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గతంలోను ఒకసారి ఇలానే ప్రధానిని పదవి నుంచి తొలగించింది ఆ దేశ సుప్రీంకోర్టు. ఇప్పుడు షరీప్ వంతు వచ్చింది.
 
ఉగ్రవాదాన్నిప్రొత్సహిస్తున్న పాక్ లో సైన్యం చెలరేగి అధ్యక్ష పీఠాన్ని హస్తగతం చేసుకుంటుందనే ప్రచారం మరోవైపు సాగుతోంది. దీంతో ఇప్పుడు పాక్ లో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*