పవన్ కల్యాణ్ తుస్సుమన్నట్లేనా…



Want create site? Find Free WordPress Themes and plugins.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ పై బాగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయన చేతులు ఊపితే ఓట్లు పడతాయా అంటూ తెలంగాణ సి.ఎం కేసీఆర్ ప్రశ్నించారు. అంతే కాదు.. పవన్ అన్న చిరంజీవి లాంటి వ్యక్తే పార్టీని నడపలేక కట్టెల మోపు బరువును కిందకు దించాడని చెప్పారు. మొత్తంగా పవన్ తన సత్తా చాటలేదని చెప్పకనే చెప్పాడు కేసీఆర్. పునాది పటిష్టంగా లేకపోతే ఇళ్లు గట్టిగా ఉండదు. ఇప్పుడు పవన్ పరిస్థితి అంతేనన్నారు కేసీఆర్. తెలంగాణతో పాటు.. ఏపీలోను ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పాడు కేసీఆర్. దీంతో పవన్ వర్గం మరింతగా నిరాశలో కూరుకుపోయింది. జనసేన వర్గం చేసిన సర్వేలో రానున్న కాలంలో ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ సర్కారులో మరోసారి వస్తాయని తేలింది.
                      ప్రశాంత్ కిషోర్ సర్వేలోను అదే రిపోర్టు వచ్చింది. బీజేపీ, టీడీపీ, పీడీపీ సంస్థ చేసిన సర్వేలోను ఏపీలో జనసేనకు అసలు సీన్ లేదని తేల్చాయి. కనీసం 15 శాతంకు మించి జనసేనకు ఓట్లు రావని చెప్పారు. దీంతో ఆ పార్టీకి ఊపు తగ్గింది. పవన్ కల్యాణ్ మాటలకే పరిమితమని.. చేతలు చూపించక పోతున్నాడని చెబుతున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్ ఏదో చేద్దామని రాజకీయాలకు వచ్చినా.. ఎలా చేయాలనే విషయంపై క్లారిటీ లేకుండా పోయాడు. మూడేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఒక్క అడుగు సరిగా పెట్టలేకపోతున్నాడు. ఏపీలో టీడీపీ, బీజేపీ కూటమిని కాదని.. వెళ్లే పరిస్థితి లేదు. ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే సత్తా లేదని సర్వేలు చెప్పడంతో ఆయన ప్రశాంతంగా తన షూటింగ్ లను జరుపుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆయన పై వ్యాఖ్యలు చేయడం హాట్ టాపికైగా మారింది. మరోవైపు జనసేన నుంచి ఎలాంటి కౌంటర్లు రాలేదు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*