నంద్యాలలో టీడీపీ విన్, 50వేల ఓట్ల మెజార్టీ అంటున్న మాజీ మంత్రి



Want create site? Find Free WordPress Themes and plugins.

టీడీపీ నేతలైన ఎన్.ఎం.డి ఫరూక్, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో వారిద్దరి ఎమ్మెల్సీ సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. వారితో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఫరూక్ నంద్యాల ఉప ఎన్నికల పై మాట్లాడారు. టీడీపీకి అక్కడ 50 వేల మెజార్టీ వస్తుందని చెప్పారు. అంతే ఒక్కసారిగా నంద్యాలలో టీడీపీ క్యాడర్ లో ఉత్సాహం వచ్చినట్లుంది. వ్యూహాత్మకంగా మైనార్టీ నేత నౌమాన్ కు ఉర్దూ అకాడమీ ఛైర్మన్ గా నియమించిన సి.ఎం చంద్రబాబునాయుడు మరోవైపు ఫరూక్ కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి వారి మనసులు దోచుకున్నారు. 

                 రంజాన్ మాసం సందర్భంగా తమ నేత ఫరూక్ కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని ముస్లిం సోదరులు సి.ఎం చంద్రబాబును అడిగారు. ఇందుకు ఆయన హామీనివ్వడమే కాదు.. ఆచరణలో చూపించారు. అందుకే ఇప్పుడు మైనార్టీలంతా టీడీపీకి జై కొడుతున్నారు. మరోవైపు ఫరూక్ తనకు పదవి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కానీ నంద్యాల ఉప ఎన్నికల కోసమే తనకు పదవి ఇచ్చారని వస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పి కొట్టారు. అలా కాదు.. తాను పార్టీకి చేస్తున్న సేవలను చూసే ఈ పదవి ఇచ్చారని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. 
                 వైసీపీకి నంద్యాలలో నేతలెవరు లేకనే… శిల్పా మోహన్ రెడ్డిని తీసుకువచ్చారని.. టీడీపీ నేతలు తప్ప మరోకరు వైసీపీకి పనికి రాలేదన్నారు. అందుకే శిల్పాను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. చాలా కాలంగా ఎమ్మెల్సీ సీటు కోసం వేచి చూస్తున్న రామసుబ్బారెడ్డి వర్గంలో కాస్తంత అసంతృప్తి తగ్గింది. చంద్రబాబును నమ్ముకోవడం వల్ల కచ్చితంగా ప్రయోజనం ఉందని చెబుతున్నారు వాళ్లు. మంత్రి ఆదినారాయణ వల్ల తమకు ఇబ్బంది లేకుండా చూడాలని వారు కోరారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*