సత్తా చాటుతున్న జోత్స్నబెండపూడి  Want create site? Find Free WordPress Themes and plugins.
       
      అమెరికాలోని బే ఏరియాకు చెందిన అమ్మాయి జోత్స్న బెండపూడి . ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు బటర్ ప్లైయిస్ సినిమా హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తిగా మహిళా ఓరియంటేడ్ సినిమాల్లో నటిస్తూ ఈ అందాల సోయగం అందరినీ ఆకట్టుకుంటోంది. అమెరికాలోని బే ఏరియాలో ఉంటున్న జోత్స్న బెండపూడి  తనకు వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. ఈ చిత్ర విజయానికి అందరూ సహకరించాలని కోరారు కథానాయిక.
         డాన్స్ దిల్ సే వ్యవస్థాపకులైన జోత్స్బె బెండపూడి  హీరోయిన్ గానే కాదు..క్రియేటివ్ డైరెక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా, నటిగా, నృత్యకారిణిగా విశేషంగా రాణిస్తున్నారు. అంతే కాదు..రొమాంటిక్ కామెడీ షోలు రాయడమే కాదు..దర్శకత్వం వహించి తనలో ఉన్న ప్రతిభకు పదునుపెడుతున్నారు. పల్లెసీమలను ఎలా అభివృద్ధి చేయాలనే అంశం పై ఆమె రాసిన నాటిక బహుళ ప్రజాదరణ పొందింది. పల్లెటూరు పట్టణానికి మధ్య జీవన విధానంలో ఉన్న తేడాను డాన్స్ దిల్ సే లో చాలా స్పష్టంగా చూపించిందామె. పల్లెసీమల లోతుల్లోకి వెళ్లి మరీ వాస్తవాలను చెప్పేలా ఆమె తన క్రియేటివ్ తో కలానికి పదును పెడుతోంది. 
        ఇటు రచయితగా..అటు నటిగా..మరోవైపు దర్శకత్వంలోను ప్రతిభ చూపుతున్న జోత్స్నను తెలుగు ప్రజలే కాదు..ఎన్నారైలు అభినందిస్తున్నారు. ఇలాంటి అమ్మాయి ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటించడం వరమంటున్నారు. గ్రామాలను యువత ఎలా అభివృద్ధి చేసుకోవచ్చనే అంశాల పై శ్రీమంతుడుతో పాటు..చాలా సినిమాల్లో చూపించారు. అలానే తన కలంతో పల్లెసీమల అభివృద్ధికి ఎలా బాటలు వేయవచ్చో తెలిపే తీరులో ఉంది హీరోయిన్ జోత్స్న తీరు. అందుకే ఇప్పుడు పూర్తిగా మహిళలే నటీమణులుగా చేసే వినూత్న తరహా చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికాలోని శాంతాక్లారాతోపాటు, బే ఏరియా వంటి ప్రాంతాల్లో తన కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్న జోత్స్న మరింత ఎత్తుకు ఎదగాలని నమస్తే ఆంధ్రా కోరుకుంటోంది. 
 
         మహిళలే నటీమణులుగా చేసే తొలి తెలుగు సినిమా పేరు బటర్ ప్లైస్. 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇలా వినూత్నంగా సినిమా చేయడం ఇదే ప్రధమం. భీమవరం టాకీస్ బ్యానర్‌పై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా రూపొందనున్న బటర్ ఫ్లైస్‌ చిత్రం పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు కె.ఆర్‌.ఫణిరాజ్ దర్శకుడు. ఇంకా ఈ మూవీలో హర్షిని, రోజా భారతి, మేఘన రమి, సుప్రజ, ప్రవల్లికలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. బటర్ ప్లైస్ సినిమా తొలి సన్నివేశానికి ఏపీ ఎఫ్‌డిసి ఛైర్మన్ అంబికా కృష్ణ క్లాప్ కొట్టారు. జీవిత రాజశేఖర్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నల్లముల్లు రాధ గౌరవ దర్శకత్వం వహించారు. నటి కవిత వారికి సహకరించారు.
        ఈ చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ మూడు సంవత్సరాలు క్రితమే ఈ కథతో, ఇలాంటి డిఫరెంట్ సినిమా చేయాలనుకున్నాం. మహిళలకు ఎదురయ్యే కష్ట నష్టాలను ఈ చిత్రంలో చూపించబోతున్నామన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఫిల్మ్ కోర్స్ చేశాను. 75 సంవత్సరాల సినీ చరిత్రలోనే అందరూ మహిళలతో చేస్తున్న తొలి చిత్రమిదని చెప్పారు చిత్ర దర్శకుడు కె.ఆర్‌. ఫణిరాజ్. ఈ చిత్ర విజయానికి అందరూ సహకరించాలని కోరారాయన. 
       మనల్ని మనమే గౌరవించే విధంగా మహిళలు నడుచుకోవాలన్నారు జీవితా రాజశేఖర్. మహిళలను అసభ్యకరంగా చూపించే చిత్రాలు తగ్గాలి. భవిష్యత్‌లో మహిళలను గౌరవించే చిత్రాలు మరిన్ని రావాలని ఆకాక్షించారు జీవిత. మహిళలను గౌరవిస్తే ఆ దేశం విజయపథంలో దూసుకుపోతుంది. ఆడది అంటే మాతృత్వం.. మృదు స్వభావానికి ప్రతీక. ఇలాంటి ఓ చిత్రం తీయడం మంచి ప్రయత్నం. గొప్ప విషయమన్నారు ఏపీ ఎఫ్‌డిసి ఛైర్మన్. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కె.ఆర్‌.ఫణిరాజ్‌,  సాహిత్యం డాక్టర్ కె.గీత, సాధనాల, సంగీతం ప్రత్యోదన్, సినిమాటోగ్రఫీ కర్ణ ప్యారసాని. 
        భీమవరం టాకీస్ లో నిర్మిస్తున్న 91వ సినిమా కావడంతో నిర్మాత రామ సత్యారాయణ మహిళా నటులందరికీ అభినందనలు తెలిపారు. మగవాళ్లు ఎవరూ లేకుండా సినిమా నిర్మించడం ఒక ఎత్తయితే కథానాయికగా కీలక పాత్రలో బెండపూడి జోత్స్న నటించనుండటంతో భారతీయ చలన చిత్ర చరిత్రలోనే ఇదో వినూత్న కావ్యంగా నిలుస్తుందని అంతా అంచనా వేస్తున్నారు.
         తెలుగు సినిమాలో అందులోను మహిళలే ఉండే సినిమాలో బే ఏరియాకు చెందిన అమ్మాయి కీలక పాత్ర పోషించనుండటంతో జోత్స్నకు అభినందనలు తెలిపారు స్థానికులు. ఆమె సినిమా విజయవంతం కావాలని పిలుపునిచ్చారు.  
 
 
 
 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*