కలిసికట్టుగా వెళితే విజయం మనదే



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద్యాల ఉప ఎన్నికల పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్లైయింగ్ స్కాడ్ లా ఊరికే తిరగడం కాదు. అంతా కలిసి ప్రజలతో మమేకం కావాలి. అప్పుడే 50 వేల మెజార్టీ టీడీపీకి వస్తుందని చెప్పారాయన. తన యాలూరు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు కావాలని పింఛన్లు రాలేదని… రుణమాఫీ చేయలేదని చెప్పిన వైనాన్ని గుర్తు చేశారు. మీరు అలాంటి పనులు చేయవద్దు. ప్రభుత్వ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండని చెప్పారు చంద్రబాబు. అంతే కాదు.. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం గురించి చెప్పేందుకు అఖిలప్రియ, ఫరూక్‌, నౌమాన్‌, ఏవీ సుబ్బారెడ్డి, శాంతారాం, శ్రీధర్‌రెడ్డిలు కలిసి తిరగాలని సూచించారు. మీరంతా విడివిడిగా వెళ్లడం వల్ల వారిలో ఐకమత్యం లేదనే సంకేతాలు వస్తున్నాయి. అందుకే అంతా కలిసి ప్రచారం చేయాలని కోరారట. అంతా ఒక సైన్యంలా కలిసి పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ ఎన్నికలు మీ నాయకత్వ వృద్ధికి దోహదపడుతాయని పిలుపునిచ్చారు. 
                    ప్రజల వద్దకు వెళ్లి ఓటేస్తే వేయండి. లేకపోతే లేదని ప్రక్రియను మానుకోవాలని హితవు పలికారంటున్నారు. మరోవైపు శిల్పా మోహన్ రెడ్డికి మద్దతుగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నంద్యాలలో దిగడం హాట్ టాపికైంది. అసలే చిన్న ప్రాంతం కావడంతో ఇప్పుడు నంద్యాల హోటల్స్, లాడ్జిల్లో రూముల కొరత ఏర్పడుతోంది. నంద్యాలలో ఉంటున్న జనం కంటే ఎక్కువగా బయట ప్రాంతాల నుంచి పలు పార్టీలకు చెందిన వారు రావడంతో ఇప్పుడు నంద్యాల కర్నూలు వాతావరణంలా మారిపోయింది. విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అదే సమయంలో పోలీసులు తమ శక్తిమేర పని చేస్తున్నా రద్దీ తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతోంది. వాహనాలు పెద్ద ఎత్తున నంద్యాలకు పోటెత్తడమే ఇందుకు కారణం. చోట మోటా నేతలంతా తమ వాహనాలను నంద్యాలకు తరలించడమే ఇందుకు కారణం. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*