అంత్యంత సుందర నగరంగా మారనున్న నంద్యాల



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద్యాలలో ఎన్నికల పుణ్యమా అంటూ అవసరానికి మించి అభివృద్ధి జరుగుతోంది. చక్కని రోడ్లు దర్శనమిస్తున్నాయి. రోడ్లను వెడల్పు చేస్తున్నారు. ఇందుకు ఎవరు పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. ఇప్పుడు డబుల్ రోడ్డు నంద్యాలలో కనపడనున్నాయి. కేవలం రహదారుల విస్తరణకే రూ.116 కోట్లు కేటాయించారంటే ఎంతగా నంద్యాల పై దృష్టి పెట్టారో అర్థమవుతోంది. మరోవైపు తాగునీటికి రూ. 78 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. చామకాల్వలో కంప చెట్లు తొలగింపు పనులు చేస్తున్నారు. మరోవైపు వరదలతో కుందునది నంద్యాల మీద పడకుండా దాన్ని వెడల్పు చేయనున్నారు. ఫలితంగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చినా నంద్యాల ప్రజల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతే కాదు.. నంద్యాలను సీడ్ కేపిటల్ విలేజ్ గా ఏర్పాటు చేయనున్నారు. మెగా సీడ్ పార్క్ తో పాటు.. దేశంలోని అతిపెద్దదైన విత్తనోత్పత్తి సంస్థను నంద్యాలలో ఏర్పాటు చేయనున్నారు.  తద్వారా నంద్యాల నుంచే మిగతా ప్రాంతాలకు విత్తనాలు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. 
                 అంతే కాదు.. సీసీ రోడ్లు, అంతర్గత రోడ్లతో పాటు..పారిశుధ్యం, పరిశుభ్రత విషయంలోనే కాదు..సౌకర్యాలు, పార్కుల ఏర్పాటు వంటి వాటిలోను ముందంజలో ఉంది నంద్యాల. అంతే కాదు..నంద్యాలకు రెండు సార్లు వచ్చి వెళ్లిన సి.ఎం చంద్రబాబునాయుడు వరాల జల్లు కురిపించారు. పనిలో పనిగా 13 వేల ఇళ్లను ప్రజలకు నిర్మించనున్నారు. వారే కాదు.. నంద్యాలలో ఉంటున్న మీడియా ప్రతినిధులందరికీ ఇళ్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పడం హాట్ టాపికైంది. తమకు అది చేస్తాం. ఇది చేస్తామని చెప్పిన వారే తప్ప..చేసింది లేదని ఇన్నాళ్లు చిన్న స్థాయి మీడియా ప్రతినిధులు తిట్టుకునే వారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోతోంది. నంద్యాలలో మీడియా ప్రతినిధులందరినీ ఆదుకునే పని చేయడం సంతోషకరమే. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే అన్ని రకాలుగా నంద్యాల అభివృద్ధి చేస్తామని టీడీపీ, వైసీపీ అభ్యర్థులు బ్రహ్మానందరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిలు చెబుతున్నారు. మరోవైపు నేతలు ఎక్కడికక్కడే మకాం వేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా మారింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*