జగన్ రహస్యంగా ఎందుకు కలుస్తున్నాడంటే…



Want create site? Find Free WordPress Themes and plugins.
       వైసీపీ అధినేత జగన్ ఏంచేసినా చాలా రహస్యంగానే ఉంటోంది. అవసరమైతే హఠాత్తుగా మీడియాకు లీకులిస్తాడు. మరికొన్ని సందర్భాల్లో సీక్రెట్ మెయిన్ టెయిన్ చేస్తాడు. కానీ ఇప్పుడు గవ్నరర్ నరసింహన్ ను మరోసారి రహస్యంగా కలిశాడు జగన్. అక్రమాస్తుల కేసులో జగన్ ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. అన్ని కేసులను కలిపి విచారించాలని కోర్టులో విన్నవించినా ఒప్పుకునే పరిస్థితి లేక తనకు తానే ఆ పిటిషన్ ఉపసంపరించుకున్నాడు.ఇలాంటి సమయంలో ప్రధాని మోడీని కలవడం కష్టమని తెలిసి..గవర్నర్ నరసింహన్ ద్వారా ఆయన తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారంటున్నారు. అందుకే తరచుగా నరసింహన్ వద్దకు వెళుతున్నాడు. అధికారిక కారును పక్కన పెట్టి ప్రైవేటు వాహనంలో రాజ్ భవన్ కు వెళ్లాడు జగన్. ఆయనతో చాలా సేపు మాట్లాడారు. దీని పై రాజ్ భవన్ వర్గాలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 
       జగన్ గవర్నర్ ను కలవకపోతే ఇప్పటికే ఖండనలు వచ్చి ఉండేవి. అలాంటివి ఏమి రాకపోవడంతో జగన్ కచ్చితంగా కలిశాడనే వార్తకు బలం చేకూరుతోంది. పాదయాత్ర చేయబోయే ముందు కేసుల వివాదం ఆయన్ను చుట్టుముట్టే అవకాశముంది. అందుకే గవర్నర్ ను కలిసి..పాదయాత్రకు ఇబ్బంది లేకుండా చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టారంటున్నారు. అసలు గవర్నర్ ను ఆ పోస్టును తొలగించి మరో కీలక మైన స్థానంలో పెట్టే ఆలోచనలో ఉంది కేంద్రం. అలాంటి సమయంలో గవర్నర్ ను బలంగా నమ్ముతున్నారు జగన్. 
         కేంద్రంలో ఉన్న ఓ నేత చెప్పిన మాట ఆధారంగానే గవర్నర్ నరసింహన్ ను జగన్ కలిశాడంటున్నారు. నేరుగా వారితో జగన్ మాట్లాడక పోయినా..నరసింహన్ తో మాట్లాడించిన తనకు అనుకూల నిర్ణయం వచ్చేలా పావులు కదుపుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*