అకున్ సబర్వాల్ కు బెదిరింపులు



Want create site? Find Free WordPress Themes and plugins.
       ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్‌ వస్తున్నాయి. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు. ఏం చేస్తున్నారు..ఎప్పుడెప్పుడు మీరు బయటకు వస్తారో అన్ని వివరాలు మా వద్ద ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్ కేసులో మాఫియా ముఠా గుట్టును రట్టు చేస్తున్నారు పోలీస్ అధికారి. అందుకే ఆయన పై మాపియా బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్‌ కాల్స్‌గా గుర్తించిన పోలీసులు వాటి పై సమగ్ర దర్యాప్తు చేస్తోంది. డ్రగ్స్‌ మాఫియా నుంచి ఈ కాల్స్ వచ్చాయని భావిస్తున్నారు. తన పై ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కుతగ్గేది లేదని ఇప్పటికే అకున్ సబర్వాల్ చెప్పారు. పూరీ జగన్నాద్, సుబ్బరాజు, తరుణ్ లు చెప్పిన కీలక ఆధారాలు ఇప్పుడు పోలీసులకు మరింతగా ఉపయోగ పడనున్నాయి.
          తమ గుట్టు మట్లు మొత్తం బయటకు రావడంతో ఇప్పుడు డ్రగ్స్ మాపియాకు చేతులు కాళ్లు ఆడటం లేదు. అందుకే వారు పోలీస్ అధికారిని బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారు. సి.ఎం కేసీఆర్ అండదండలు ఉండటంతో అకున్ సబర్వాల్ వెనక్కు తగ్గడంటున్నారు. మరోవైపు రాజకీయ ఒత్తిడిలు అకున్ సబర్వాల్ కు ఉన్నాయని చెబుతున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*