జగన్ పాదయాత్రకు అడ్డంకి



Want create site? Find Free WordPress Themes and plugins.
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు అడ్డంకులు పడే అవకాశాలున్నాయి. కోర్టు కేసులో ఉండటమే ఇందుకు కారణం. అన్ని కేసులు కలిపి ఒకేసారి విచారించాలని జగన్ చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు ఒప్పుకునే పరిస్థితి లేదు. అందుకే ముందుగానే తాను పెట్టుకున్న దరఖాస్తును వెనక్కు తీసుకున్నాడు జగన్ పక్షం లాయర్. అక్రమాస్తుల కేసులో విచారణను వేగవంతంగా చేస్తోంది కోర్టు. అందుకే ఇక మీదట ఎక్కువ సార్లు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటోంది జగన్. అదే జరిగితే పాదయాత్రను మధ్యలోనే ఆపాల్సి ఉంటోంది. ఇలా కోర్టులు, కేసుల కోసం పాదయాత్ర ఆపడం వ్యతిరేకతను తీసుకువస్తోంది. అందుకే జగన్ పార్టీ ముందుకా వెనుక్కా అనే డైలామాలో పడింది. 
                 జగన్ పై ఇప్పటికే 11 చార్జ్ షీట్లు ఉన్నాయి. వాటి విచారణ వేగవంతమైతే రోజు హాజరు కావాల్సి ఉంటోంది. అలాంటి సమయంలో పాదయాత్ర ఆయనకు ఇబ్బందే అవుతోంది. ఆరు నెలలపాటు కంటిన్యూగా పాదయాత్ర చేయాలనుకుంటున్న జగన్ అనుచరులకు ఇప్పుడు దిక్కు తోచడం లేదు. మరోవైపు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని మోడీలతో మాట్లాడి తమకు అనుకూలంగా ఏమైనా మార్పులు వస్తాయనే ఆలోచన చేస్తున్నారట. కేసులకు రాజ్యంగ బద్దంగా ఎన్నికైన వారికి సంబంధం లేదు. అయితే వారితో తమకున్న పరిచయాలతో ఈకేసుల నుంచి బయట పడవచ్చేమో అని ఆలోచిస్తుందట జగన్ పార్టీ అండ్ టీమ్. మరి ఏం జరుగుతుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*