ఫిదా మూవీ సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 3.25/5
నటీనటులు : వరుణ్ తేజ్, సాయి పల్లవి, సాయి చంద్, రాజా, సత్యం రాజేష్ తదితరులు 
దర్శకుడు : శేఖర్ కమ్ముల
పరిచయం….
                 దర్శకుడు శేఖర్ కమ్ముల అంటే సినిమా ఎలా ఉన్నా చూస్తారు. ఆనంద్, హ్యపీడేస్, గోదావరి వంటి ప్రేమ కథలను ప్రేక్షకులకు అందించిన ఘనత ఆయనది. అందుకే ఫిదా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పడు ఫిదా రూపంలో మరో అందమైన చిత్రాన్ని తెరమీదకు తెచ్చారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘ఫిదా’ అందరినీ అలరిస్తోంది. 
              లోఫర్, మిస్టర్ చిత్రాల తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా కావడంతో ఆసక్తితో పాటు..ఉత్కంఠను పెంచింది. మలయాళంలో ప్రేమమ్ చిత్రం ద్వారా వెండితెరపైకి దూసుకొచ్చింది సాయి పల్లవి. కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతున్న సాయి పల్లవి ఈ చిత్రంలో కథానాయిక. తమిళంలో ధామ్ ధూమ్, మలయాళంలో ప్రేమమ్, కలి తర్వాత కెరీర్‌లో ఆమెకు ఫిదా నాలుగో చిత్రం ఫిదా. ఆనంద్, హ్యాపీడేస్ చిత్రాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలలో కొల్లగొట్టాడు శేఖర్ కమ్ముల. సహజత్వానికి దగ్గర ఉండేలా సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలా అబ్బింది. అందుకే శేఖర్ కమ్ముల అనగానే కళ్లు మూసుకుని సినిమా హాల్ లో అడుగు పెడుతున్నారు. ఫిదా సినిమాకు అలానే వెళుతున్నారు ప్రేక్షకులు.
               2014లో తీసిన అనామిక చిత్రం తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా ఇది. వరుణ్ తేజ్ కు లోఫర్, మిస్టర్ సినిమాలు ఆశించిన విజయాలు అందించలేదు. రాంగ్ ట్రాక్ లో పడ్డారా అనిపించింది. మరోవైపు అనామిక చిత్రం శేఖర్ కమ్ములకు కాస్త తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. మొత్తంగా ఇద్దరికి ఫిదా హిట్ వరంగా మారనుంది. మరోవైపు సాయిపల్లవి తెలుగులో హిట్ కొట్టేందుకు సిద్దమైన తరుణంలో వచ్చిన సినిమా ఎలా ఉందో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ ఏంటంటే…
                   హీరో వరుణ్(వరుణ్ తేజ్) తన అన్న (రాజా) తమ్ముడుతో కలిసి అమెరికాలో ఉంటాడు. అక్కడే మెడిసిన్ చదువుతుంటాడు. డాక్టర్‌గా అమెరికాలోనే సెటిల్ అవ్వాలనేది వరుణ్ ఆలోచన. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో ఆ ముగ్గురు కలిసి ఉంటారు. అన్నయ్యకు పెళ్లి జరిగితే అంతా బావుటుందని అనుకుంటాడు వరుణ్. అందుకే ఇంటర్నెట్‌లో మ్యారేజ్ వెబ్‌సైట్ చూశాడు. ఆ క్రమంలోనే తెలంగాణలోని బాన్సువాడలో ఉంటున్న భానుమతి (సాయిపల్లవి) ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు. భానుమతి అక్క (రేణు)తో వరుణ్ అన్నయ్య పెళ్లిచూపులు జరుగుతాయి. ఇద్దరికీ నచ్చడంతో వారంలోపే పెళ్లి జరుగుతుంది. ఇదే సమయంలో పెళ్లి కూతురు చెల్లెలు భానుమతి వరుణ్ కు చాలా దగ్గరవుతోంది. ఇద్దరు ప్రేమించుకొంటారు. మనసులోనే పెట్టుకుంటారు కానీ ఒకరికొకరు చెప్పుకోలేకపోతారు. వరుణ్‌ తన మరదలితో మాట్లాడే సందర్భాన్ని చూసి తప్పుగా అర్థం చేసుకుంటోంది భానుమతి. అంతే అతని పై ఉన్న ప్రేమను చెరిపేసుకుంటుంది. 
                   భానుకి మొదటి నుంచి తన ఊరు, పొలాలంటే చాలా ఇష్టం. అవే తన ప్రపంచంగా బతుకుతుంటుంది. తనకు కాబోయే వాడు అలా తనతో ఊర్లోనే ఉండాలని అనుకుంటోంది. కానీ వరుణ్ అలా ఉండలేడని భావించిన భాను తన ప్రేమ విషయాన్ని చెప్పకుండా దాచేస్తుంది. అనుకోని సంఘటన చూసిన బాను ఇక వరుణ్ మొహం చూడకూడదనుకుంటోంది. మరోవైపు వరుణ్ మాత్రం భానుతో మాట్లాడాలని తపిస్తాడు. కానీ భాను మాత్రం పెద్దగా పట్టించుకోదు. వరుణ్‌పై ఉండే కోపంతో భాను ఓ వ్యాపారవేత్త (హర్షవర్థన్ రాణే) తో పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ భానుమతి ప్రేమలో పీకల్లోతు మునిగిన వరుణ్ పరిస్థితి ఇబ్బందిగా ఉంటోంది. ఇదే సమయంలో భానుమతి బాన్సువాడ నుంచి అమెరికాకు పయనమవుతోంది. అక్కడ భాను, వరుణ్ మధ్య ప్రేమ, ద్వేషం వంటి సన్నివేశాలు ఉంటాయి. కొన్నాళ్లకు ప్రేమను పక్కన పెట్టి మంచి స్నేహితులుగా మారుతారు వారిద్దరు. ఆ తర్వాత భాను బాన్సువాడకు వస్తోంది. ఇదే సమయంలో భానును వదలేక వరుణ్ బాన్సువాడకు వస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది..? వరుణ్ అమెరికా వెళ్లాడా లేదా…భాను.. వరుణ్ ప్రేమను అర్థం చేసుకుంటుందా..? ఇద్దరు తిరిగి ఒక్కటవుతారా..? పెళ్లి చేసుకుంటారా..లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 
శేఖర్ మార్కు…అద్భుతం…
 
                    తెలంగాణ అమ్మాయికి, అమెరికాలో ఉండే అబ్బాయికి మధ్య జరిగే ప్రేమకథే నే‘ఫిదా’.  విభిన్నఅభిరుచులు ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రేమ ఎలా కలిపిందనే పాయింట్‌ను దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా బాగా చూపించాడు. చూసేటప్పుడు నెక్స్ట్ ఏమొస్తుందనే ఆసక్తి ఉంటోంది. చాలా అందంగాను చూపించారు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకుంటోంది. బాన్సువాడ గ్రామాన్ని బాగా అందంగా చూపించారు. సినిమా సహజంగా, మన ఊళ్లో పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో.. అచ్చం అలానే కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అమ్మాయి, అబ్బాయిల మధ్య నడిచే సంభాషణలు, సన్నివేశాలు సినిమాకే హైలైట్‌. చానాళ్ల తర్వాత ఓ మంచి ప్రేమకథను చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. సాయి పల్లవి కేరక్టర్ ను ఆయన మలిచిన తీరు బాగుంది. పల్లె సీమలో కుంటుంబాల మద్య ఉండే బంధాలు, అనుబంధాలు, అత్త, మామ, అక్క, తండ్రి మధ్య ఉండే ప్రేమను చాలా బాగా తెరపై చూపించారు. మొత్తంగా ఫీల్ గుడ్ మూవీ అనిపించారు. 
సాయి పల్లవి ప్లస్…
                      ఈ మూవీకి సాయిపల్లవి దొరకడం హైలెట్ అనే చెప్పాలి. తన నటనతో అందరినీ అలరించింది. తెలంగాణ యాసలో ఇరగదీసింది. సాయి చెప్పే డైలాగ్స్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. డబ్బింగ్ బాగా కుదిరింది. సాయి నటనకు ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది సాయి పల్లవి. సాయి చలాకీగా, చిలిపిగా కనిపించి ప్రేమను పంచే మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తోంది. కవ్విస్తోంది. గ్లామర్ అంటే వెస్ట్రన్ డ్రస్ లు వేసుకోవడం కాదని సాయి పల్లవి నిరూపించింది. తెలుగు అమ్మాయిలా లంగా ఓణిలో తెర మీద చూడగానే మనపక్కింటి అమ్మాయి అనేలా ఉంటోంది. ఆమె నటన చాలా బాగుంది. ఇటు నటన, అటు గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి భవిష్యత్ లో జయసుధ, జయ ప్రద, సావిత్రి, భానుమతి వంటి వారిని మరిపిస్తుంది. వరుణ్ తేజ్ నటన బాగానే ఉంది.  
                       హీరోయిన్ తండ్రి పాత్రలో సాయి చంద్ బాగా నటించాడు. తండ్రి, కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు వాస్తవానికి దగ్గరగా ఉంచాయి. సత్యం రాజేష్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. సినిమాటోగ్రఫీ సహజత్వానికి దగ్గరగా చాలా అందంగా ఉంటోంది. నటీనటులు, లొకేషన్స్‌ను చాలా అందంగా చూపించారు. సాయి పల్లవికి అక్కగా శరణ్య ప్రదీప్ బాగా ఆకట్టుకుంది. తెలంగాణ యాసకు తగినట్టు హావభావాలను, కీలక సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది. వరుణ్ స్నేహితుడి పాత్రలో సత్యం రాజేశ్ పర్వాలేదు. రాజేశ్ వినోదాన్ని బాగానే పంచాడు. 
సంగీతం…
                   
                          ఫిదా సంగీతం అదుర్స్ అనే చెప్పాలి. ఫస్టాప్ లో సీన్స్ కు అనుగుణంగా వచ్చిన సంగీతం హైలెట్. సెకండ్ హాఫ్‌లో సినిమా కాస్త స్లో‌గా నడిచినట్లు ఉంటోంది. కొన్ని సీన్స్ ను కొద్దిగా తగ్గించినా ఇబ్బంది ఉండేది కాదనిపిస్తోంది. నిర్మాణ విలువలు బేష్. చాలా కాలం తరువాత ఓ మంచి సినిమాను చూసిన భావన కలుగుతుంది. శక్తి కాంత్ అందించిన సంగీతం చాలా బాగుంది. అన్ని పాటలు సరిగ్గా కుదిరాయి. ‘వచ్చిందే..పిల్లా మెల్లగా వచ్చిందే.. క్రీమ్ బిస్కెట్ వచ్చింది’, ‘ఏదో జరుగుతుంది’, ‘హేయ్ పిల్లగాడా’, ‘ఊసుపోదు.. ఊరుకోదు’ పాటలు సినిమా నుంచి బయటకు వచ్చాకను గుర్తుంటాయి. మొత్తంగా ఈ మూవీ చూసి అందరూ ఫిదా అవ్వడం గ్యారెంటీ. 
ప్లస్ పాయింట్లు…
+ శేఖర్ కమ్ముల ప్రతిభ
+ సాయి పల్లవి నటన
+ ప్రేమ కథ
+ రిచ్ గా ఉన్న లోకేషన్లు
+ ఆకట్టుకునే సంగీతం
+ భావోద్వేగాలతో సాగే కథ
+ సహజంగా ఉండే సీన్లు
మైనస్…
– సెకండాఫ్ సీన్స్ లెన్త్
– వరుణ్ స్నేహితుడి పాత్ర
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*